Ross Taylor: టేలర్‌ సరికొత్త రికార్డు.. అత్యధిక పరుగుల జాబితాలో చేరిన కివీస్ తొలి బ్యాట్స్‌మెన్‌

WTC Final: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ జట్టుతో న్యూజిలాండ్ తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టీంలో అత్యంత అనుభవజ్ఞుడైన బ్యాట్స్ మాన్ రాస్ టేలర్.. తన కెరీర్‌లో మరో మైలురాయిని సాధించాడు.

Venkata Chari

|

Updated on: Jun 23, 2021 | 10:29 PM

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ జట్టుతో న్యూజిలాండ్ తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టీంలో అత్యంత అనుభవజ్ఞుడైన బ్యాట్స్ మాన్ రాస్ టేలర్.. తన కెరీర్‌లో మరో మైలురాయిని సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో 18,000 అంతర్జాతీయ పరుగుల మార్కును దాటిన తొలి న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ గా రికార్డుల్లోకి ఎక్కాడు.

1 / 4
అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ జాబితాలో టేలర్ ప్రస్తుతం మూడవ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 22,862 అంతర్జాతీయ పరుగులు చేశాడు. కోహ్లీ టెస్టుల్లో 7,490 పరుగులు చేయగా, వన్డేల్లో 12,169 పరుగులు చేశాడు. టీ 20 లో 3159 పరుగులు చేశాడు.

2 / 4
కోహ్లీ తర్వాత వెస్టిండీస్‌కు ఆటగాడు క్రిస్ గేల్ రెండో స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో గేల్‌ 19, 359 పరుగులు సాధించాడు. గేల్ టెస్టుల్లో 7214 పరుగులు చేయగా, వన్డేల్లో 10, 480 పరుగులు, టీ 20 లో 1656 పరుగులు పూర్తిచేశాడు.

3 / 4
రాస్ టేలర్ తరువాత, ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ నాలుగో స్థానంలో ఉన్నాడు. రూట్ టెస్టుల్లో 8714 పరుగులు, వన్డేల్లో 5962 పరుగులు చేశాడు. టీ 20 లో 893 పరుగులు మాత్రమే పూర్తి చేశాడు.

4 / 4
Follow us