Karnam Malleswari: ఒలింపిక్స్ విజేతలను తయారు చేయడమే లక్ష్యం.. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీ కరణం మల్లీశ్వరి..
Karnam Malleswari: ఒలింపిక్స్ విజేతలను తయారు చేయడమే లక్ష్యంగా ఢిల్లీలో స్పోర్ట్స్ యూనివర్సిటీ పని చేస్తుందని ఆ యూనివర్సిటీకి...
Karnam Malleswari: ఒలింపిక్స్ విజేతలను తయారు చేయడమే లక్ష్యంగా ఢిల్లీలో స్పోర్ట్స్ యూనివర్సిటీ పని చేస్తుందని ఆ యూనివర్సిటీకి తొలి వైస్ ఛాన్సిలర్‌గా నియమితులైన కరణం మల్లీశ్వరి చెప్పారు. తాను త్వరలోనే యూనివర్సిటీకి వీసీగా బాధ్యతలు చేపడతానని అన్నారు. దేశంలో ఇప్పటి వరకు మణిపూర్‌లోని నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక్కటే క్రీడల కోసం ప్రత్యేకంగా ఉన్న యూనివర్సిటీ అని చెప్పారు. ఇప్పుడు ఢిల్లీలో ఏర్పాటు కానున్న యూనివర్సిటీ రెండవదని, దేశంలో క్రీడా సదుపాయాలను పెంపొందిస్తే ప్రపంచ స్థాయి క్రీడాకారులు తయారవుతారని ఆమె పేర్కొన్నారు. మరింత మంది క్రీడాకారులను తయారు చేయడమే తన లక్ష్యమని చెప్పారు కరణం మల్లీశ్వరి. తెలుగు రాష్ట్రాల్లోనూ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
కాగా, ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్న స్పోర్ట్స్ యూనివర్సిటీకి కరణం మల్లీశ్వరిని వైస్ చాన్సిలర్‌గా నియమిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. ఆ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. కరణం మల్లీశ్వరి త్వరలోనే వీసీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో స్వర్ణ పథకం సాధించిన తొలి భారతీయ మహిళ కరణం మల్లీశ్వరి రికార్డ్ నెలకొల్పిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కూడా ఆమె రికార్డ్‌ను తిరగరాయలేకపోయారు. కాగా, ఢిల్లీ వేదికగా ఏర్పాటవుతున్న స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడాకారులను ప్రోత్సహించనున్నారు. ప్రపంచ స్థాయి అథ్లెట్లను రూపొందించడమే లక్ష్యంగా ఈ యూనివర్సిటీ సేవలందించనుంది.
Also read:
Anchor Ravi: ఈ చిన్నోడు… హీరోకు తక్కువ యాంకర్‌కు ఎక్కువ… యాకర్ రవి స్టన్నింగ్ లుక్… ( వీడియో )
Vakkaya Benefits: విటమిన్ ‘సి’ అధికంగా ఉండే వాక్కాయ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో
Reliance AGM: కరోనా కష్టకాలంలో రిలయన్స్ చేసిన సేవ సంతోషం కలిగించింది..ముఖేష్ అంబానీ