Rubiks Cube World Record : సచిన్ టెండూలర్క్‌ను ఫుల్ ఫిదా చేసిన ఆ కుర్రాడు మరో అద్భుతం సాధించాడు
భారతదేశ దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ముంబైకి చెందిన ఓ టీనేజర్ అద్భుతమైన ప్రతిభకి ఆశ్చర్యపోవడమే కాదు, ఫుల్ ఫిదా..
Mohammed Aiman Koli : భారతదేశ దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మనసు దోచిన ముంబైకి చెందిన మొహమ్మద్ ఐమాన్ కోలీ తాజాగా మరో అద్భుతం సృష్టించాడు. కేవలం 15. 56 సెకండ్లలో రూబిక్ క్యూబ్ ఫజిల్ పూర్తి చేసి సరికొత్త గిన్నీస్ బుక్ రికార్డు సాధించాడు. దీంతో అంతకుముందు 2019 వరకూ ఉన్న 16. 96 సెకండ్ల గిన్నీస్ వరల్డ్ రికార్డుని అధిగమించాడు. చిన్నప్పటి నుంచి కఠోర శ్రమతో ఈ స్థాయికి వచ్చినట్టు ఐమాన్ కోలి చెప్పాడు. ఎంతో పరిశ్రమ, మరెన్నో ప్రయత్నాల తర్వాత తమ కుమారుడు ఈ స్థాయికి రాగలిగాడని కోలి అమ్మ తెహజీబ్ తన సంతోషాన్ని వెలిబుచ్చారు.
కాగా, ఈ టీనేజర్ అద్భుతమైన ప్రతిభకి నాలుగునెలల క్రితమే ఆశ్చర్యపోవడమే కాదు, ఫుల్ ఫిదా అయిపోయాడు మాజీ దిగ్గజ క్రికెటర్ టెండూల్కర్ . ఆ కుర్రాడు చేసిన అద్భుతమైన ఫీట్ ని పలువురితో పంచుకోకుండా ఉండలేకపోయాడు. సచిన్ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన సదరు యువకుడి వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమేకాదు, ప్రపంచ దిగ్గజాలూ ఆశ్చర్యపోయేలా చేసింది. ముంబైకి చెందిన మొహమ్మద్ ఐమాన్ కోలీ అనే యువకుడు రూబిక్స్ క్యూబ్ ఫజిల్ ను చూడకుండానే సచిన్ ముందు సాల్వ్ చేశాడు. చాలా మందికి రూబిక్స్ క్యూబ్ సమస్యను పరిష్కరించాలంటే రోజుల తరబడి గడిచినా పరిష్కారం కాదు. అయితే, ఈ యువకుడు కేవలం 17 సెకండ్ల లోపే.. అదీ కళ్లతో చూడకుండానే సాల్వ్ చేశాడు.
ఆ సందర్భంలో సచిన్ ఏమన్నారంటే.. “నేను ఇక్కడ ఐమాన్ కోలితో ఉన్నాను. ఇదేంటో మీకు తెలుసు. రూబిక్స్ క్యూబ్. నేను దీనిని మార్పులు చేసి అతనికి ఇవ్వబోతున్నాను. అతను కళ్ళ మూసుకుని మరీ.. దీనిని పరిష్కరించబోతున్నాడు. అన్నట్టు, కోలి గిన్నిస్ రికార్డ్ హోల్డర్. ఒక భారతీయ వ్యక్తి ఇంతటి ప్రతిభావంతుడైనందుకు మనమంతా గర్వపడుతున్నాం ” అని సచిన్ టెండూల్కర్ ఆ వీడియోలో తెలిపారు.
View this post on Instagram
Read also : Gold : పంచలింగాల చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడ్డ దాదాపు రూ. ఐదున్నర కోట్లు విలువైన బంగారం