AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold : పంచలింగాల చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడ్డ దాదాపు రూ. ఐదున్నర కోట్లు విలువైన బంగారం

కర్నూలు జిల్లా పోలీసులకు పెద్ద ఎత్తున బంగారం చిక్కింది. తనిఖీల్లో భాగంగా 5 కేజీల 85 గ్రాముల బంగారం పట్టుకున్నారు పోలీసులు. దీని విలువ సుమారు 2 కోట్ల..

Gold : పంచలింగాల చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడ్డ దాదాపు రూ. ఐదున్నర కోట్లు విలువైన బంగారం
Gold
Venkata Narayana
|

Updated on: Jun 25, 2021 | 7:17 AM

Share

Gold worth nearly Rs. 5.5 crore seized : కర్నూలు జిల్లా పోలీసులకు పెద్ద ఎత్తున బంగారం చిక్కింది. తనిఖీల్లో భాగంగా 5 కేజీల 85 గ్రాముల బంగారం పట్టుకున్నారు పోలీసులు. దీని విలువ సుమారు 2 కోట్ల 50 లక్షలు ఉంటుందని అంచనా. విలువ సరైన పత్రాలు , ఆధారాలు లేని కారణంగా సదరు బంగారం బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కీరప్ప, కాగినెల్లి ఎపియస్, ఇంకా సెట్ అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి ఆదేశాల మేరకు పంచ లింగాల రాష్ట్ర సరిహద్దు సిట్ చెక్ పోస్టులో తెల్లవారుజామున చేసిన తనిఖీల్లో పెద్ద ఎత్తున బంగారం చిక్కింది.

పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎట్ సిఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో లోకల్,సెబ్ పోలీసులు కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాదు నుండి బెంగళూరు వెళుతున్న AP 39 TG8888 విక్షం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లో ప్రయాణిస్తున్న బెంగళూరుకు చెందిన నగల వ్యాపారి మహావీర్ జైన్ దగ్గర ఈ బంగారం పట్టుబడింది.

కాగా, మహావీర్ జైన్ బెంగళూరులోని శివాజీ నగర్ లో ఉన్న అరిహంత్ జ్యువెలరీ షాప్ యజమాని. అతని బ్యాగులో సుమారు 5 కేజీల 85 గ్రామలు (45 బంగారు బిస్కెట్లు , రెండు నెక్లెస్ లు) సోదాల్లో గుర్తించారు . వాటికి సంబంధించి సరైన పత్రాలు , ఎలాంటి ఆధారాలు , ఈ – వే బిల్లులు చూపనందున వాటిని కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్ నందు తదుపరి చర్య నిమిత్తం అప్పగించారు .

ఈ సందర్భంగా కర్నూలు పట్టణ డిఎస్పీ కె.వి మహేష్ , కర్నూలు తాలుకా ఏవి కంటగిరి రాముడు కలిసి తాలూకా పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి బంగారం వివరాలు వెల్లడించారు. కాగా, చెక్ పోస్టు దగ్గర చేసిన వాహన తనిఖీలలో సిఐ కంటగిరి రాముడు , ఎస్ఐలు ఖాజా వాలి, లక్ష్మి నారాయణ, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read also : YS Sharmila : రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు పర్యటించనున్న వైయస్. షర్మిల

Follow Us
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!