Sania Mirza: మరో సంచలనం.. మరో చరిత్ర.. తొలి మహిళా అథ్లెట్‌గా రికార్డ్..
భారత్ తరఫున నాలుగు సార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి మహిళా క్రీడాకారిణిగా నిలవనుంది టెన్నిస్ తార సానియా మిర్జా. ఈ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ కోసం కఠోర శ్రమ చేస్తున్నట్లు తెలిపింది.
మరో సంచలనం.. మరో చరిత్ర.. తొలి మహిళా అథ్లెట్‌గా రికార్డ్.. ఇండియన్ టెన్నిస్‌లో సంచలనం.. ఆమె మన సానియా మీర్జా. దేశంలో మహిళల టెన్నిస్‌కు ఆమె ఓ దిక్సూచి. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అరుదైన రికార్డులను.. మైలురాళ్లను దాటిన సానియా.. ఇప్పుడు ఒలింపిక్స్‌లో హిస్టరీ క్రియేట్ చేసింది. 34 ఏళ్ల సానియా ఇండియా తరఫున నాలుగు ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. జులై 23 నుంచి ప్రారంభం కానున్న ఈ గేమ్స్ కోసం సానియా అద్భుతమైన ప్రాక్టీస్ చేస్తోంది.
వచ్చీ రావడంతో…
సానియాను ఒలింపిక్స్.కామ్‌కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంలో తన గురించి తాను ఇలాం చెప్పుకుంది. తనది అద్భుతమైన కెరీర్ అని, తనపై, తన సామర్థ్యా లపై తనకు నమ్మకం వల్లే ఇది సాధ్యమైందని ఆమె చెప్పింది. 30ల్లో ఉన్న తాను ఇంకా ఎన్ని రోజులు ఆడతానో తెలియదని అన్నారు. అయినా తనకు ఫ్యూచర్‌లోకి తొంగి చూడటం అలవాటు లేదని సానియా చెప్పుకొచ్చారు. 2018లో బాబుకు జన్మనిచ్చిన సానియా.. గతేడాది మళ్లీ టెన్నిస్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. వచ్చీ రావడంతో హోబర్ట్ ఇంటర్నేషనల్ WTA టోర్నీ గెలిచింది.
ఇప్పుడు ఈస్ట్‌బౌర్న్ టోర్నీ ఆడుతోంది..
రికార్డు స్థాయిలో నాలుగోసారి ఇండియా తరఫున ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించడం తనకు గర్వంగా ఉన్నదని సానియా చెప్పింది. ఒలింపిక్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. తొలిసారి టాప్ 100లోపు ఉన్న ఇండియన్ ప్లేయర్‌తో కలిసి సానియా డబుల్స్ బరిలోకి దిగుతోంది.