ఇంటి పైకప్పు తుడుస్తుండగా వర్కర్లకు షాక్.. పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి విస్తుపోయే విషయాలు.!

అదొక పాడుబడిన భవంతి. ఆ రోజు యజమాని చెప్పినట్లుగా వర్కర్లు వెళ్లి ఆ ఇంటి పైకప్పును తుడుస్తున్నారు. ఇంతలోనే వారికి ఊహించని పరిణామం ఎదురైంది...

ఇంటి పైకప్పు తుడుస్తుండగా వర్కర్లకు షాక్.. పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి విస్తుపోయే విషయాలు.!
Skelton
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 25, 2021 | 10:53 AM

అదొక పాడుబడిన భవంతి. ఆ రోజు యజమాని చెప్పినట్లుగా వర్కర్లు అందరూ కూడా వెళ్లి ఆ ఇంటి పైకప్పును తుడుస్తున్నారు. ఇంతలోనే వారికి ఊహించని పరిణామం ఎదురైంది. పూర్తి పాడైపోయిన స్థితిలో ఓ ఆస్థిపంజరం లభ్యమైంది. ఈ ఘటన కోల్‌కతాలోని పోర్టు ఏరియాలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

కొన్ని నెలల క్రితం వేర్‌హౌస్ నిర్మాణం కోసం ఒక ప్రైవేట్ సంస్థకు కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్‌(గవర్నమెంట్ కార్యాలయం) ఓ బిల్డింగ్ అద్దెకు ఇచ్చింది. దానిలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ప్రతీరోజూలాగే రెండు రోజుల క్రిందట వర్కర్లు ఆ ఇంటి పైకప్పును శుభ్రం చేస్తుండగా.. వారికి ఓ ఆస్థిపంజరం లభించింది. దీనితో వెంటనే సమాచారాన్ని నార్త్ పోర్ట్ పోలీసులకు అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ శాంపిల్స్ సేకరించడంతో పాటు చుట్టుప్రక్కల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ప్రాంతంలో ఎవరైనా తప్పిపోయినట్లు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయా.? లేదా అనే విషయాలను ఆరా తీస్తున్నారు. జూన్ నెలలో కోల్‌కతా నగరంలో వరుసగా బయటపడిన నాలుగో ఆస్థిపంజరం ఇది.

కాగా, సుమారు 15 రోజుల క్రితం దక్షిణ కోల్‌కతాలోని బాన్స్‌డ్రోని ప్రాంతం చెరువులో ఓ అస్థిపంజరం కలకలం రేపింది. దాన్ని చూసి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందజేయడంతో.. వారు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆ చెరువు నుంచి ఆస్థిపంజరాన్ని బయటికి తీసి స్వాధీనం చేసుకున్నారు. సమీపంలో నివాసముంటున్న మతిస్థిమితం లేని ఓ వ్యక్తి ఆ చెరువులో పడి చనిపోయినట్లు పోలీసులు ప్రాధమిక విచారణలో తేల్చారు. అలాగే భవానీపూర్ ప్రాంతంలో, జూన్ 10న ఒక పాడుబడిన దుకాణంలో మరొక అస్థిపంజరాన్ని పోలీసులు కనుగొన్కన సంగతి తెలిసిందే. ఇలా కోల్‌కతాలో వరుసగా నాలుగో ఆస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకోవడంతో.. పోలీసులు వాటి వెనుక మిస్టరీని కనిపెట్టే పనిలో పడ్డారు.

Viral Video: అందంతో చంపుతున్న సొట్టబుగ్గల సుందరి.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో.!

Viral Video: ఆఫ్రికన్ పైథాన్‌తో తల్లి చిరుత ఫైట్.. అది చేసిన పనికి నెటిజన్లు సలామ్.. వైరల్ వీడియో!

సెహ్వాగ్, డివిలియర్స్ స్టైల్‌లో.. 17 బంతుల్లో 76 పరుగులు.. బౌలర్లకు చుక్కలే చుక్కలు!

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?