RRB NTPC Exams: ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షల షెడ్యూల్ విడుదల అంటూ వార్తలు.. నకిలీ వార్తలన్న రైల్వే బోర్డు
RRB NTPC Exams: కరోనా మహమ్మారి కారణఃగా పోటీ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (ఎన్‌టీపీసీ) 7వ విడత పరీక్షలను రైల్వే రిక్రూట్‌మెంట్.
RRB NTPC Exams: కరోనా మహమ్మారి కారణంగా పోటీ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (ఎన్‌టీపీసీ) 7వ విడత పరీక్షలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వాయిదా వేసింది. అయితే తాజాగా ఈ పరీక్ష షెడ్యూల్ విడుదలైందంటూ సోషల్ మీడియాలో పోస్టులు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై ఆర్‌ఆర్‌బీ స్పందించింది. వీటిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పరీక్ష షెడ్యూల్ నకిలీదని, నిజం లేదని తెలిపింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్స్ చెక్ సైతం దీనిని ధృవీకరించింది. ప్రస్తుతానికి రైల్వే బోర్డు ఈ కంప్యూటర్ అధారిత పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు ఏచయలేదని, అభ్యర్థులు ఈ నకిలీ నోటిఫికేషన్‌ను నమ్మవద్దని ఫ్యాక్ట్స్ చెక్ సైతం కోరింది. ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షలు దశల వారీగా జరుగనున్నాయి. గత ఏప్రిల్ 8న ఎన్‌టీపీసీ పరీక్షలు ముగిసిన తర్వాత ఇప్పటికే తదుపరి ఏడో విడత పరీక్షల కోసం ఎలాంటి నోటిఫికేషన్లు వెలువడలేదు. కరోనా కారణంగా వివిధ రాష్ట్రాలలో లాక్‌డౌన్ విధించడంలో పరీక్షలు వాయిదా వేస్తున్నామని మే 31న ఆర్‌ఆర్‌బీ ఒక ప్రకటన విడుదల చేసింది. పరిస్థితులు చక్కబడ్డాక తదుపరి పరీక్షల తేదీలు ప్రకటిస్తామని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ కిక్రూట్‌మెంట్‌లో 35,208 ఖాళీలను భర్తీ చేస్తోంది.
ఇందులో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్ లాంటి పోస్టులు ఉన్నాయి. వీటికి 1.26 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇప్పటిదాకా 95లక్షల మందికి పరీక్షలు జరిపామని ఆర్ఆర్బీ తెలిపింది. ఈ పరీక్షలలో అర్హత సాధించినవారు తదుపరి కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తదుపరి పరీక్షకు సంబంధించిన నకిలీ నోటిఫికేషన్‌ను నమ్మవద్దని ఫ్యాక్ట్స్ చెక్ హెచ్చరించింది. అధికారిక సమాచారం కోసం అభ్యర్థలు ఆర్ఆర్బీ వెబ్‌సైట్‌ను మాత్రమే ఫాలో కావాలని కోరింది. తప్పుదోవ పట్టించే అనధికారిక సమాచారాన్ని నమ్మవద్దని బోర్డు సైతం హెచ్చరించించింది.