Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 7 మెడికల్ కళాశాలల్లో.. 2,135 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
Medical College Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలో మరో ఏడు మెడికల్ కళాశాలలు ఏర్పాటుచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన
Medical College Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలో మరో ఏడు మెడికల్ కళాశాలలు ఏర్పాటుచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్‌కర్నూలు, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాలలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ర్టంలోని కొత్త, పాత వైద్య, నర్సింగ్ కాలేజీలకు సిబ్బంది నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇస్తూ బుధవారం ఉత్తర్వులిచ్చింది. తాత్కాలికంగా సిబ్బందిని నియమించుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.
ఏడు మెడికల్ కాలేజీలకు 2,135 పోస్టులు, 13 కొత్త, 2 పాత నర్సింగ్ కళాశాలలకు 900 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నియామకాలను తాత్కాలిక ప్రతిపాదికన చేపట్టాలని అధికారులను ఆదేశించింది. 2022 మార్చి నెలాఖరు వరకు నియామకమైన వారి సేవల వినియోగానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే.. ఈ నియామకాల ప్రక్రియ వేగవంతంగా జరగనుందని అధికారులు వెల్లడించారు.
కాగా.. తెలంగాణ రాకముందు ఈ ప్రాంతంలో కేవలం 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత 5 కొత్త కాలేజీలు ఏర్పాటు చేశారు. తాజాగా మరో 7 కాలేజీల నిర్మాణానికి అనుమతి ఇవ్వడంతో.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య 16 కు చేరింది.
Also Read: