నాటి కోకాకోలా ప్లాంట్ ఇప్పుడిలా ..! 600 బెడ్ల కోవిద్ ఆసుపత్రిగా అవతరించిన వేళ.
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో సుమారు 20 ఏళ్ళ క్రితం కొకకోలా ప్లాంటును ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన స్థలం లో ఇప్పుడు 600 పడకల అధునాతన ఆసుపత్రి దర్శనమిస్తోంది. 34 ఎకరాల ఈ సువిశాల స్థలంలో కోకకోలా ప్లాంటును ఏర్పాటు చేయడానికి అప్పటి ప్రభుత్వం..
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో సుమారు 20 ఏళ్ళ క్రితం కొకకోలా ప్లాంటును ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన స్థలం లో ఇప్పుడు 600 పడకల అధునాతన ఆసుపత్రి దర్శనమిస్తోంది. 34 ఎకరాల ఈ సువిశాల స్థలంలో కోకకోలా ప్లాంటును ఏర్పాటు చేయడానికి అప్పటి ప్రభుత్వం యత్నించగా స్థానికులు తీవ్ర నిరసన తెలిపారు. దీనివల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని, భూగర్భ జలాలు కూడా కలుషితమవుతాయని వారు ఆందోళనకు పూనుకొన్నారు. చివరకు 2004 లో ఈ ప్లాంట్ షట్టర్లను మూసివేయగా ప్లాచిగూడ అనే ఆ స్థలం తాలూకు వార్తలు పాతబడిపోయాయి. కానీ దాదాపు 20 సంవత్సరాల అనంతరం మళ్ళీ ఇది వార్తలకెక్కింది. 600 బెడ్స్ తో కూడిన కోవిద్ ఆసుపత్రిగా మారింది .. కేరళ విద్యుత్ శాఖ మంత్రి కృష్ణన్ కుట్టి చొరవతో ఈ హాస్పిటల్ ఏర్పాటయింది. కోకకోలా ప్లాంట్ మాజీ ఉద్యోగులు ఇచ్చిన సూచనతో ఆయన ప్లాంట్ యాజమాన్యాన్ని కలిసి ఇక్కడ ఆసుపత్రి నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఆ అధికారులు కూడా ఇందుకు అంగీకరించారు.
పైగా ఇక్కడ అవసరమైన మరమ్మతుల్లో సహకరించారు. కాగా మరో రెండు వారాల్లో ఈ ఆస్పత్రి నిర్మాణ పనులు పూర్తి కానున్నాయని….మంత్రి చెప్పారు. 75 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ దవాఖానలో 100 ఆక్సిజన్ బెడ్స్, 40 ఐసీయూ బెడ్స్, 10 వెంటిలేటర్లు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని నిర్మాణానికి చిన్నపాటి రైతులు కూడా విరాళాలు ఇచ్చారట.300 మంది వాలంటీర్లు రాత్రనక, పగలనక కష్టపడి దీని నిర్మాణంలో కృషి చేశారని మంత్రి కృష్ణన్ కుట్టి చెప్పారు. ఇంకా దీని అభివృద్డికి ఈ నియోజకవర్గ పరిధిలోని 8 గ్రామ పంచాయతీలు 10 లక్షల చొప్పున, చిత్తూరు బబ్లాక్ పంచాయతీ 30 లక్షలు కేటాయించినట్టు ఆయన వెల్లడించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: బీఎస్ఎఫ్ జవాన్ల తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..ఒంటెలపై యోగా నా..!:Yoga on Camel video.
మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రానాకు ఊరట..బాంబే హైకోర్టు ఉత్తర్వుల నిలిపివేత:MP Navneet Kaur video.
కోవాగ్జిన్ ఫేజ్ 3 ట్రయల్స్ ..!భారత్ బయో టెక్ నివేదిక ఇదే..పూర్తి వివరాలు ఇవే :Covaxin Phase 3 video.