Ravi Kiran |
Updated on: Jun 25, 2021 | 7:06 PM
తరచుగా వైద్యులు డయాబెటిస్ రోగులను తీపి ఆహార పదార్ధాలకు దూరంగా ఉండమని చెబుతారు. కాని ఈ రోజు మనం ఓ తియ్యటి పండు గురించి మాట్లాడుకుందాం. అది చక్కర కంటే 300 రెట్లు తియ్యగా ఉంటుంది. దాని ప్రత్యేకత ఇదే. డయాబెటిస్ రోగులకు ఈ పండు ఓ వరం.
మేము మాట్లాడేది 'మాంక్ ఫ్రూట్' గురించి. ఈ పండులో అమైనో యాసిడ్, ఫ్రక్టోజ్, మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.
ఈ పండ్ల మొక్కలను మొదటిగా చైనాలో పండించేవారు. ఇక ఇప్పుడు పాలంపూర్‌లో సిఎస్‌ఐఆర్, ఎన్‌బిపిజిఆర్ ఆమోదం లభించిన తర్వాత, దీనిని భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున పండిస్తున్నారు.
మాంక్ పండ్ల నుంచి తయారు చేయబడే ఒక ప్రత్యేక రకమైన పౌడర్ (మొంగ్రో సైడ్)ను టీ, పాలు, స్వీట్స్‌తో సహా ఇతర ఆహార పదార్ధాలలో ఉపయోగించవచ్చు. ఇది చక్కెర కంటే మూడు వందల రెట్లు ఎక్కువ తీపిగా ఉంటుంది.