Viral Photo: రెండు కుటుంబాల మధ్య గొడవ.. చెట్టును ఎలా మార్చారో చూడండి! వైరలవుతోన్న ఫొటో
ఇరుగుపొరుగు వాళ్లకు భేదాభిప్రాయాలు వస్తే గొడవలు పెట్టుకుంటారు. అలా కాకుంటే కొట్టుకుని, కేసుల వరకు వెళ్తారు. ఇలా మనం రోజుకు ఎన్నో చూస్తూనే ఉంటుంటాం. కానీ, తాజాగా యూకే లో జరిగిన ఓ గొడవను చూస్తే మాత్రం షాకవుతారు.
Viral Photo: ఇరుగుపొరుగు వాళ్లకు భేదాభిప్రాయాలు వస్తే గొడవలు పెట్టుకుంటారు. అలా కాకుంటే కొట్టుకుని, కేసుల వరకు వెళ్తారు. ఇలా మనం రోజుకు ఎన్నో చూస్తూనే ఉంటుంటాం. కానీ, తాజాగా యూకే లో జరిగిన ఓ గొడవను చూస్తే మాత్రం షాకవుతారు. పక్కింటి వాళ్లతో గొడవపెట్టుకుని, ఆ కోపాన్ని పాపం చెట్టుపై చూపించారు. ఆ చెట్టును సగానిపైగా కత్తిరించారు. పొరుగింటి వారు చేసిన పనిపై ఓ పక్క విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఆ చెట్టు ఫొటో మాత్రం అందర్ని ఆకట్టుకుంటూ.. ప్రస్తుతం వైరల్‌గా మారింది. అసలు విషయానికి వెళ్తే.. ఉత్తర ఇంగ్లండ్‌లోని భారతీయ సంతతికి చెందిన భారత్ మస్త్రీ కుంటుంబం నివసిస్తోంది. అయితే వారి ఇంటి ఆవరణలో అకోనిఫెర్ జాతి చెట్టును పెంచారు. ఇది చాలా పెద్దగా పెరిగింది. పొరుగింటి వారి సరిహద్దు వైపు కూడా వాలింది.
అయితే, ఈ చెట్టుపై కొన్ని పక్షులు గూళ్లు కట్టుకున్నాయి. పొరుగింటి వారి సరిహద్దుపై ఉన్న కొమ్మలకు గూళ్లు పెట్టి, పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నాయని తరచుగా మిస్త్రీతో గొడవలు పెట్టుకుంటున్నారు. అయితే ఈ చెట్టు చాలా ఆకర్షణగా ఉందని, చెట్లపై పక్షులు గూళ్లు పెట్టడం సహజమేనని భారత్ మిస్త్రీ ఎన్నోసార్లు సర్ది చెప్పారు. అయినా పొరుగింటి వారి కోపం మాత్రం తగ్గలేదు. పైగా భారత్ మిస్త్రీని ట్రీ సర్జన్ అంటూ హెళనగా మాట్లాడేవారు. దీంతో మిస్త్రీ చాలా అసంతృప్తికి గురయ్యేవాడు. ఈ నేపథ్యంలో ఒక రోజు పొరుగింటి వారు వారి సరిహద్దులో ఉన్నకొమ్మలు పూర్తిగా కోశారు. దీంతో ఆ చెట్టు ప్రస్తుతం ఒకవైపు కొమ్మలు లేకుండా సగం మాత్రమే మిగిలింది. దీంతో చాలామంది ఆ ఫొటోను నెట్టింట్లో షేర్ చేశారు. ఆ చెట్టు ఫొటో వైరల్‌గా మారింది. అయితే, ఆ చెట్టు భవితవ్యంపై భారత్ మిస్త్రీ ఆందోళన చెందుతున్నాడు.
కాగా, ఈ ప్రాంతలోని మిగతా వారు మాట్లాడుతూ, ఈ రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని, కానీ, ఇలా చెట్టుపై కోపం చూపించడం ఏం బాగోలేదని అంటున్నారు. రెండు కుటుంబాల మధ్య వైరం మొదలుకాక ముందు భారత్ మిస్త్రీ.. ఆ చెట్టును పొరుగింటి వారి అనుమతితో బంతి ఆకారంలో కత్తిరించాడు. కానీ, ఎప్పుడైతే ఆ చెట్టుపై పక్షులు గూళ్లు పెట్టాయో, అప్పటి నుంచి గొడవలు పెద్దవయ్యాయంట. చెట్టు కొమ్మలు కత్తిరించవద్దని పొరుగింటి వారిని కోరినట్లు మిస్త్రీ చెప్పుకొచ్చాడు. కానీ, వారు వినలేదని, చివరికి చెట్టును ఇలా ఒకవైపు మొండిదానిగా మార్చేశారని ఆయన వాపోయాడు. ప్రస్తుతం ఈ చెట్టు చాలామందిని ఆకర్షిస్తోంది.
Also Read: