AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఖాళీ సిరంజితోనే వ్యాక్సిన్‌ వేసిన నర్సు..! వైరలవుతోన్న వీడియో

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 18 సంవత్సరాలకు పైబడిన వాళ్లందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్ వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ వ్యక్తికి ఖాళీ సిరంజీతోనే వ్యాక్సిన్‌ ఇచ్చిన నర్సు వీడియో వెలుగులోకి వచ్చింది.

Viral Video: ఖాళీ సిరంజితోనే వ్యాక్సిన్‌ వేసిన నర్సు..! వైరలవుతోన్న వీడియో
Bihar Nurse Gives Empty Shot
Venkata Chari
|

Updated on: Jun 25, 2021 | 10:28 PM

Share

Viral Video: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 18 సంవత్సరాలకు పైబడిన వాళ్లందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్ వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ వ్యక్తికి ఎంప్టీ డోస్‌ను ఇచ్చిన నర్సు వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని చప్రా జిల్లాలో జూన్ 21న ఈ సంఘటన జరిగింది. ఓ నర్సు కొవిడ్ వ్యాక్సిన్లు వేస్తూ.. ఇతరులకు సమాధానాలు చెప్తూ బిజీగా ఉంది. ఇంతలో ఓ వ్యక్తి వ్యాక్సిన్ కోసం వచ్చాడు. ఇతరులతో మాట్లాడుతూ, సిరంజీ తీసుకుంది. కానీ, అందులో వ్యాక్సిన్‌ను మాత్రం నింపడం మర్చిపోయింది నర్సు. డైరెక్ట్‌గా ఆ వ్యక్తికి వ్యాక్సిన్ వేసినట్లుగా సిరంజీ కుచ్చింది. కానీ, అది ఎంప్టీ డోస్. అయితే, టీకా వేస్తున్న సమయంలో సదరు వ్యక్తి స్నేహితుడు వీడియోను తీశాడు. వారు చాలాసేపటి తరువాత ఈ వీడియోను చూసుకుంటే అసలు విషయం బయటపడింది. దీంతో వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.

కాగా వ్యక్తి స్నేహితుడు మాట్లాడుతూ..”టీకా తీసుకుంటున్న తన స్నేహితుడి రియాక్షన్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవాల‌నే వీడియా తీశాను. అనంతరం ఈ వీడియోని చూస్తున్నప్పుడు డౌట్ వ‌చ్చింద‌ని, ప్లాస్టిక్ క‌వ‌ర్ నుంచి నేరుగా సిరంజీ తీసిన నర్సు.. త‌న ఫ్రెండ్‌కు ఇచ్చిందని” తెలిపాడు.

ఈ వ్యక్తి పేరు అజార్. తన ఫ్రెండ్ అమన్‌ఖాన్‌ తీసిన వీడియోను చూసి షాకయ్యానని మీడియాతో వెల్లడించారు. సదరు వీడియోను మంత్రులు, డాక్టర్లకు ట్యాగ్ చేశాడు. దీంతో ఆరాష్ట్ర అధికారులు జోక్యం చేసుకుని ఆమెను విధుల నుంచి తొలగించారు.

“ఈ వీడియో గురించి సమాచారం వచ్చింది. నర్సు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ఈ మేరకు నర్సు చందా కుమారిని వెంటనే విధుల నుంచి తొలగించామని, 48 గంటల్లో ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించామని ” సరన్ జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ (డీవోవో) డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు.

అయితే, నర్సు ఉద్దేశపూర్వకంగా ఇలా చేయలేదని, టీకా కేంద్రంలో చాలా ఓత్తిడి ఉందని, ప్రజలు ఎక్కువ మంది హాజరవడంతో సిబ్బంది చాలా ఒత్తిడిలో ఇలా చేశారని డీవోవో పేర్కొన్నారు. కాగా, ఆ వ్యక్తికి మరలా వ్యాక్సిన్ అందిస్తామని ఆయన తెలిపాడు.

Also Read:

Viral Video: కంపెనీ సీయీవో తో వీడియో కాల్..అంతలో ఆమె ఒక్కసారిగా వెనక్కు పడిపోయింది.. అంతా షాక్.. ఏం జరిగిందంటే..

Viral Video: వేదికపై ఓ వ్యక్తి చెంప చెళ్లుమనిపించిన నవ వధువు.. కారణం ఏంటంటే..?

Viral Video: లైవ్ లో వార్తలు చదువుతూ..జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించిన న్యూస్ ప్రెజెంటర్.. తరువాత ఏమైందంటే..

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై