Viral Video: కంపెనీ సీయీవో తో వీడియో కాల్..అంతలో ఆమె ఒక్కసారిగా వెనక్కు పడిపోయింది.. అంతా షాక్.. ఏం జరిగిందంటే..

Viral Video: ఒకరి ఇబ్బంది మరొకరికి భలే నవ్వు తెప్పిస్తుంది ఒక్కోసారి. కరోనా దెబ్బకు చాలామంది వర్క్ ఫ్రం హోమ్ విధానంలో పనిచేస్తున్నారు. ఈ సమయంలో తరచూ వీడియో కాల్స్ ద్వారా మీటింగ్ లు నిర్వహిస్తున్నారు.

Viral Video: కంపెనీ సీయీవో తో వీడియో కాల్..అంతలో ఆమె ఒక్కసారిగా వెనక్కు పడిపోయింది.. అంతా షాక్.. ఏం జరిగిందంటే..
Viral Video
Follow us
KVD Varma

|

Updated on: Jun 25, 2021 | 10:08 PM

Viral Video: ఒకరి ఇబ్బంది మరొకరికి భలే నవ్వు తెప్పిస్తుంది ఒక్కోసారి. కరోనా దెబ్బకు చాలామంది వర్క్ ఫ్రం హోమ్ విధానంలో పనిచేస్తున్నారు. ఈ సమయంలో తరచూ వీడియో కాల్స్ ద్వారా మీటింగ్ లు నిర్వహిస్తున్నారు. ఈ వీడియో మీటింగ్ లు ఒక్కోసారి హాస్యానికి వేదికగా మారుతున్నాయి. ఇప్పటివరకూ అటువంటి ఎన్నో వీడియోలు చూస్తూ వచ్చాం. ఒక ఉద్యోగి వీడియో సమావేశంలో ఉండగా అతని భార్య ఎదో గట్టిగా మాట్లాడటం ఓ వీడియోలో కనిపించి సోషల్ మీడియాలో ఆ మధ్య తెగ చక్కర్లు కొట్టింది. ఇటువంటి ఉదాహరణలు బోలెడు ఈ మధ్య చోటు చేసుకున్నాయి. ఫన్ పుట్టించే ఈ వీడియో సమావేశాల విశేషాలు ఉన్న వీడియోలకు సోషల్ మీడియాలో వేలాది మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఒక మహిళ తన ఆఫీసు ఆన్లైన్ సమావేశంలో ఉంది. ఆమె కంపెనీ సీయీవోతో మాట్లాడుతోంది. ఇంతలో అకస్మాత్తుగా ఆమె అలా.. వెనక్కి జారిపోయి పడిపోయింది. దీంతో ఆమెతో మాట్లాడుతున్న సీయీవో అవాక్కయ్యారు. మిగిలిన ఆమె కొలీగ్స్ కూడా కొంత కంగారు పడ్డారు. తరువాత మెల్లగా పైకి లేచిన ఆమె తన కుర్చీ అనుకోకుండా విరిగిపోవడంతో కింద పడినట్టు చెప్పింది. అంతే, సీయీవోతో సహా అందరూ ఒక్కసారిగా రిలాక్స్ అయ్యి నవ్వేశారు. ఆ వీడియో మీరూ చూడండి ఇక్కడ..

View this post on Instagram

A post shared by Charlotte (@charkozy)

ఈ వీడియోలో కనిపించిన ఆమె పేరు షార్లెట్. ఈ సంఘటన తరువాత ఆ వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది, అది వైరల్ అయ్యింది. మా సీయీవో తో మాట్లాడుతుండగా కుర్చీ విరిగిపోయింది..నవ్వుకోండి అంటూ ఆమె ఆ వీడియోకి క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. ఇది 11,000 కన్నా ఎక్కువ సార్లు దీనిని చూశారు. చాలామంది కామెంట్ చేశారు. ఒక నెటిజన్ ”నవ్వు ఆపుకోలేకపోతున్నాను” అంటూ కామెంట్ చేశారు. ఇంకో ఆయన ” మీరు పడిపోయినపుడు మీ చేయి ఒకటే కనిపించింది” అన్నారు. ఇంకొకాయన కేవలం మూడు సెకన్లు అందరూ ఆందోళన చెందారు. ఆ తరువాత పగలబడి నవ్వారు” అని చెప్పారు. మరొకాయన ”ఇలాంటి సంఘటనలు గతంలో నేను చూశాను” అని కామెంట్ చేశారు.

Also Read: Viral Video: వేదికపై ఓ వ్యక్తి చెంప చెళ్లుమనిపించిన నవ వధువు.. కారణం ఏంటంటే..?

Viral Video: లైవ్ లో వార్తలు చదువుతూ..జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించిన న్యూస్ ప్రెజెంటర్.. తరువాత ఏమైందంటే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!