Covid 19: పరిశోధకులు చెబుతున్న “బయో వార్” ఒక హైపోథిసిస్..! ఎలా సంక్రమిస్తుంది..? ఎలా అంతమవుతుంది..?

అంతు చిక్కని మహమ్మారి మూలాలను కనుక్కునే క్రమంలో విశ్వవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, నిపుణులు వైరస్ యాదృచ్ఛికతకు ఒక పద్ధతిని కనిపెట్టలేక పోయారు.

Covid 19: పరిశోధకులు చెబుతున్న బయో వార్ ఒక హైపోథిసిస్..! ఎలా సంక్రమిస్తుంది..? ఎలా అంతమవుతుంది..?
Covid 19 A Hypothesis
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jun 26, 2021 | 7:50 AM

(రచన: బారున్ దాస్, CEO, TV9 Network and an alumnus of IIT Chennai and IIM Kolkata)

రెండేళ్లుగా యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి అసలు మూలం ఏంటి..? తొలుత కరోనా వైరస్‌గా మొదలై.. రోజుకో రూపాంతరం చెందుతూ జనాలను హడలెత్తిస్తోంది. ఒకసారి తగ్గుతూ.. మరోసారి పెరుగుతూ మనుషుల ఉసురు తీస్తోంది. ఇంతలా విజృంభించడానికి కారణం ఏంటి..? వైరస్ ఇంకెంత కాలం ఉంటుంది..? నిపుణులు ఏమంటున్నారు..?

హైపోథిసిస్.. ఇది కరోనా సంక్రమణ దర్యాప్తునకు ప్రారంభ బిందువు. పరిమిత సాక్ష్యాల ఆధారంగా చేసిన ప్రతిపాదిత వివరణ. ఒక పాయింట్ నిశ్చయంగా నిరూపించడానికి ఏ సిద్ధాంతం కానీ, చట్టం కానీ లేనప్పుడు.. పరిశోధకులు విచారణ ప్రక్రియను ప్రారంభించడానికి ఈ సులభ సాధనాన్ని ఉపయోగిస్తారు.

కోవిడ్ -19 మూలాలు, స్వభావం రెండింటి పరంగా పరిశోధనలు జరుగుతుండగానే ఎపిడెమియోలాజికల్ పరిణామాలు మొదలయ్యాయి. ఇంతలోనే ప్రపంచ వ్యాప్తంగా భారీ నష్టం జరిగిపోయింది. ఇందులో భాగంగా లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. అంతేకాదు కోట్లాది మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోయారు. ఆర్థిక నష్టాలను మూటగట్టుకున్నారు.

పరిశోధకులు ఏం చెబుతున్నారు…

SARS-CoV-2 Covid 19 వైరస్ నిజమైన స్వభావాన్ని తెలుసుకోవడానికి పోరాటం కొనసాగుతోంది. ఇది ఎలా వస్తుంది.., ఎందుకు వస్తుంది.., ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు, ఎందుకు పోతుందో ఎవరికీ తెలియదు. ఈ దిశగా పరిశోధనలు కొనసాగుతూనేఉన్నాయి. అంతు చిక్కని మహమ్మారి మూలాలను కనుక్కునే క్రమంలో విశ్వవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, నిపుణులు వైరస్ యాదృచ్ఛికతకు ఒక పద్ధతిని కనిపెట్టలేక పోయారు. అయితే, వైరస్ విచిత్రమైన ప్రవర్తనను అర్థం చేసుకోవడంలో ప్రపంచం మొత్తం విఫలమైంది. దీంతో.. కరోనా వైరస్ వ్యాప్తి ఎలా జరిగిందనే అంశంపై కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. వైరస్ నిల్వ చేయబడిన ప్రయోగశాల నుండి లీక్ కావడంతో ఇది కాస్త ప్రపంచం మొత్తం వ్యాప్తికి కారణంగా మారిందని కొన్ని అంచనాలు ఉన్నాయి.

మన దేశంలో ఎలా మొదలు..

అయితే, భారతదేశంలో 2020 సెప్టెంబర్ 16 తేదీ నాటికి ఫస్ట్ వేవ్ వ్యాప్తి అధికంగా కనిపించింది. కోవిడ్ రిపోర్టు అందించిన లెక్కల ప్రకారం ఒకే రోజు 98 వేలకుపై కేసులు నమోదయ్యాయి. కానీ ఆ సమయం నుంచి రోజువారీ ఇన్ఫెక్షన్ల గ్రాఫ్ చాలా పెరిగిపోయింది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో దేశంలో ఎక్కడా లాక్‌డౌన్ ఆంక్షలు లేవు. కంటికి కనిపించని మహమ్మారి జాడ గుర్తించే లోపే మనపైకి సెకెండ్ వేవ్ దాడి మొదలైంది. దీంతో కాస్త అటు ఇటుగా కుదుటపడుతన్న తరుణంలో తాజాగా కరోనా థర్డ్ వేవ్ మొదలవుతోందని వైద్య నిపుణులు హెచ్చరికలు మొదలయ్యాయి.

వైరస్ విజృంభణకు కారణాలేంటీ..?

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్న సమయంలోనే ఓ వైపు పండుగలు, పబ్బాలు మరోవైపు ఎన్నికల పేరుతో ర్యాలీలు, బహిరంగసభలు వచ్చి పడ్డాయి. వందల వేల మంది ప్రజలు ఎక్కువ గంటలపాటు ఒకే చోట సమావేశం అయ్యారు. దుర్గా పూజ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, దీపావళి, క్రిస్మస్, రంజాన్, కుంభమేళా వంటి పండుగలు తోడయ్యాయి. లక్షలాది మంది ఒకచోట చేరి ప్రార్థనలు పూజలు చేశారు. మొదట మనుషుల భౌతిక దూరం పాటించకపోవడంతో మొదలై వైరస్ వ్యాప్తి, ఆ తర్వాత గాలి ద్వారా సంక్రమించే స్థాయికి పెరిగింది. దీంతో జనం విచ్చల విడిగా తిరగడంతో కేసులు మరింతగా పెరిగాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు లాక్‌డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేయడంతో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా దిగివచ్చింది.

అయితే, అంతలోనే సెకెండ్ వేవ్ వచ్చి పడింది. దేశంలో కరోనా విలయతాండవం సృష్టించింది. రోజువారీ కేసులు అంతకు ముందు మూడు రోజులు తగ్గినట్టే తగ్గి 2021 మే 6న మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోయాయి. దాదాపు 4 వేల మంది ఒక్క రోజు వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగాడినికి లాక్‌డౌన్‌ ఎత్తివేయడమే కారణం అని కొందరు వాదించారు. అయితే, జనాభాలో గణనీయంగా.. 70శాతం మందికి పైగా వైరస్ సంక్రమణకు గురైతేనే హెర్డ్ ఇమ్యూనిటీ బలపడతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి సిద్ధాంతం ఇక్కడ వర్తించదనే చెప్పాలి. అప్పుడు కూడా ఈ మహమ్మారి వ్యాప్తి తగ్గుతుందో.. ఇలానే కొనసాగుతుందో చెప్పలేమంటున్నారు నిపుణులు.

వైరస్ వ్యాప్తి తగ్గుతోంది…

ఒక వ్య‌క్తి నుంచి ఇత‌రుకుల వైర‌స్ ఎంత స‌మ‌యంలో సంక్ర‌మిస్తుంద‌న్న‌ది ఖ‌చ్చితంగా తెలియ‌రాలేదు. కానీ, సెకెండ్ వేవ్ సమయంలో ఒక కటుంబంలోని ఒక సభ్యుడికి వైరస్ సోకినట్లైతే ఆ తర్వాత ఆ ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరూ కరోనా బారినపడ్డారు. రెండవ వేవ్ మొదలైన మే 3, 4 వారం తర్వాత ఈ ధోరణి మారిపోయింది.  అయితే, ఇక్కడ ఓ విషయం గుర్తించాలి. వైరస్ క్షీణత శక్తి హైపోథిసిస్ ఎలా ఉంటుందో చెప్పవచ్చు. ఇది ప్రాథమిక క్యారియర్ నుంచి రెండవ క్యారియర్‌కు, ఆపై తృతీయ క్యారియర్‌కు సంక్రమించినప్పుడు వైరస్ శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇది, మూడవ వ్యక్తి నుంచి 4 వ స్థాయి గ్రహీతకు వచ్చే సమయానికి వైరస్ వ్యాప్తి చేసే శక్తిని దాదాపు కోల్పోతుంది.

దీంతో వైరస్ ప్రాథమిక.. ద్వితీయ, తృతీయ హోస్ట్స్‌కు బదిలీ చేయడం ద్వారా దాని శక్తిని కోల్పోతుంది. డేటాను విస్తృతంగా సేకరించి అధికారులు విశ్లేషించినట్లయితే ఈ హైపోథిసిస్ ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే డేటా అబద్ధం కాదు.ఈ హైపోథిసిస్‌లో రోజువారీ ఇన్ఫెక్షన్ గ్రాఫ్ పడిపోతోంది. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వెళ్లిన తర్వాత వైరస్ తన శక్తిని కోల్పోయింది. వ్యాది సంక్రమణ కూడా నిలిచి పోయింది.

పరిగణలోకి తీసుకునే ఈ లెక్క ఏంటంటే…

నిర్దిష్ట సంఖ్యలో వ్యక్తులకు సంక్రమణను బదిలీ చేయగల వైరస్ సామర్థ్యాన్ని డేటా పరంగా R-naught అని పిలుస్తారు. కరోనావైరస్ కోసం R-naught 5 అని పరిశోధన అంచనా వేసింది. దీని అర్థం కోవిడ్ పాజిటివ్ వ్యక్తి మరో ఐదుగురికి సోకుతుంది. దీన్ని ఐదు ప్రాథమిక అంటువ్యాధులు ఉంటే, అప్పుడు 25 ఉంటుంది. కరోనావైరస్‌కు తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలైన పార్కులు, మాల్స్, వీధుల్లో రక్షణ దుస్తులు లేకపోవడంతో ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందిజ. ఆఫీసులు, ఆస్పత్రులు, షాపులు, రెస్టారెంట్లలో పరిశుభ్రత లోపించడం కూడా కారణమవుతోంది.

ముఖ్యంగా  పీల్చడం ద్వారా వచ్చే ఫ్లూ వైరస్ లాగే, కోవిడ్-19 ఉన్న వ్యక్తి దగ్గినపుడు అతడి ముక్కు, నోటి నుంచి వచ్చిన చిన్న తుంపర్ల ద్వారా ఈ వైరస్ వ్యాపించవచ్చు. చిన్నగా దగ్గినా మూడు వేలకు పైగా తుంపర్లు బయటికి వస్తాయి. ఇవి మిగతావారిపై, చుట్టూ ఉన్న బట్టలు, ఇతర ఉపరితలాలపై పడతాయి.

జాగ్రత్తలు…

కానీ, కొన్ని చిన్న అణువులు ఇంకా గాల్లోనే ఉండిపోతాయి. వైరస్ మలంలో కూడా ఎక్కువసేపు ఉంటుందనడానికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. అందుకే ఎవరైనా టాయిలెట్ వెళ్లిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోకుంటే, అలాగే దేనైనా ముట్టుకుంటే, వాటిని వైరస్‌తో కలుషితం చేసే ప్రమాదం ఉంది.

అయితే, ఈ మమ్మారి నుంచి మనకు మనం కాపాడుకోవల్సిన అవసరం ఉంది. బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు భౌతిక దూరం పాటించడం ముఖ్యం.  కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకోడానికి మనం చేతులు శుభ్రంగా కడుక్కోవడం, తరచూ తాకే ఉపరితలాలను క్రిమిరహితం చేయడం రెండూ ముఖ్యమే అని గట్టిగా చెప్పవచ్చు. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా ఉండేందుకు  మాస్కులు ధరించడం తప్పనిసరి. కరోనా వైరస్ సోకే కంటే ముందు జాగ్రత్త పాటించడం ఎంతైనా అవసరం.