MAA Elections: ఆ అగ్రనటులంతా లోకలా? మీరు ప్రేమించే రాముడు సీత నాన్ లోకల్: రామ్ గోపాల్ వర్మ 

Ram Gopal Varma - MAA 2021 elections: టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. ప్రతిసారీ ఇద్దరు మాత్రమే పోటీ పడే ఎన్నికలలో ఈసారి నలుగురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో

MAA Elections: ఆ అగ్రనటులంతా లోకలా? మీరు ప్రేమించే రాముడు సీత నాన్ లోకల్: రామ్ గోపాల్ వర్మ 
Ram Gopal Varma
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 26, 2021 | 2:31 AM

MAA 2021 elections: టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. ప్రతిసారీ ఇద్దరు మాత్రమే పోటీ పడే ఎన్నికలలో ఈసారి నలుగురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మంచు విష్ణు, ప్రకాష్‌రాజ్‌తోపాటు.. జీవితరాజశేఖర్, హేమ కూడా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఎన్నడూ లేని విధంగా ప్రాంతీయ బేధం కూడా రాజుకుంది. ప్రకాశ్‌రాజ్ నాన్ లోకల్ అంటూ పలువురు నటులు బహిరంగంగా మాట్లాడుతుండటం చర్చనీయాంశంగా మారింది. అయితే.. లోకల్.. నాన్ లోకల్ వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. దీనిపై వివాదాస్పద దర్శకుడు.. రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో స్పందించారు. అలాంటప్పుడు అగ్రనటులందరూ.. నాన్ లోకలేనంటూ మాటల తూటాలు పేల్చారు. అమితాబ్ బచ్చన్.. రజనీకాంత్ నుంచి తెలుగు హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్ వరకూ అందరూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లినవారేనంటూ.. వారంతా లోకల్ ఎలా అవుతారంటూ వరుస ట్విట్లతో విరుచుకుపడ్డారు రామ్ గోపాల్ వర్మ. తెలుగు నేర్చుకుని 30 ఎళ్లుగా ఇక్కడే ఉంటున్న ప్రకాశ్‌రాజ్ నాన్ లోకల్ ఎలా అవుతారని ప్రశ్నించారు.

ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ ఇలా ట్విట్లు చేశారు. ‘‘కర్ణాటక నించి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రకాశ్‌రాజ్ నాన్ లోకల్ అయితే, గుడివాడ నించి చెన్నైకి వెళ్లిన రామారావుగారు, నాగేశ్వరరావుగారు … బుర్రిపాలెం నించి మద్రాస్ వెళ్లిన కృష్ణగారు, తిరుపతి నించి మద్రాస్ బయల్దేరిన మోహనబాబు గారు లోకలా ??? కర్ణాటక నించి ఏపీకి వచ్చిన ప్రకాష్‌రాజ్ నాన్ లోకల్ అయితే, మహారాష్ట్ర నుండి ఎక్కడెక్కడికో వెళ్ళిన రజనీకాంత్ గారు, ఉత్తర ప్రదేశ్ నుంచి మహారాష్ట్ర కి వెళ్ళిపోయిన అమితాబ్ బచ్చన్ గారు లోకలా? ’’ ముప్పై ఏళ్లుగా ప్రకాశ్ రాజ్ ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకొని, చలం పుస్తకాలని మళ్ళీ తనే ముద్రించి, పెళ్ళాం పిల్లలతో ఇక్కడే ఉంటూ, తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని , అక్కడున్న ఎంతో మంది ఆడవాళ్ళకి పని కల్పిస్తున్న వాడు నాన్ లోకలా ? అతని నటన చూసి నాలుగు సార్లు ఈ దేశం అతన్ని శాలువా కప్పి జాతీయ అవార్డుతో సత్కరిస్తే.. మీరు నాన్ లోకల్ అంటున్నారు. ఇలా పేర్కొనడం దేశ వ్యతిరేకమే. మీరందరూ ప్రేమించే హీరోయిన్స్ అందరూ నాన్ లోకల్ .. మైఖేల్ జాక్సన్ నాన్ లోకల్ .. బ్రూస్‌లీ నాన్ లోకల్, రాముడు సీత కూడా నాన్ లోకల్..’’ అంటూ ఆయన ఘాటుగా ట్విట్ చేశారు.

Also Read:

Rayalasima Project: ‘రాయలసీమ’పై సీఎం కేసీఆర్‌కు.. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఫోన్‌..!

Smart City Awards 2020: స్మార్ట్ సిటీలుగా సూరత్, ఇండోర్..టాప్ రాష్ట్రంగా ఉత్తర ప్రదేశ్..అవార్డులు అందచేసిన కేంద్రం!