AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలీవుడ్ బాద్ షా- అట్లీ కాంబో నుంచి క్రేజీ అప్‏డేట్.. షారుఖ్ సరసన లేడీ సూపర్ స్టార్..

Shahrukh-Atlee: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గత కొన్ని సంవత్సరాలుగా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు వరుస హిట్లతో టాప్ హీరోగా ఉన్న షారుఖ్ ప్రస్తుతం..

బాలీవుడ్ బాద్ షా- అట్లీ కాంబో నుంచి క్రేజీ అప్‏డేట్.. షారుఖ్ సరసన లేడీ సూపర్ స్టార్..
Sharukh Nayan
Rajitha Chanti
| Edited By: Anil kumar poka|

Updated on: Jun 26, 2021 | 4:24 PM

Share

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గత కొన్ని సంవత్సరాలుగా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు వరుస హిట్లతో టాప్ హీరోగా ఉన్న షారుఖ్ ప్రస్తుతం.. వరసు డిజాస్టర్స్ సినిమాలతో నెట్టుకోస్తున్నాడు. మరోవైపు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ పరిస్థితి కూడా అలాగే ఉంది. రెండేళ్లుగా తన తదుపరి సినిమా విషయంలో క్లారిటీ లేకుండా ఉన్నాడు. అట్లీ తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ బిగిల్ విడుదలై దాదాపు రెండేళ్లు దాటింది. ఇక ఈ కోలీవుడ్ డైరెక్టర్ తన తదుపరి సినిమా బాలీవుడ్ బాద్ షా తో కలిసి తీయబోతున్నట్లుగా గతంలోనే నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే షారుఖ్ కూడా అట్లీ చెప్పిన స్టోరీ విని సైలెంట్ గా ఉన్నాడట.

వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాకు సంకి అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నారట మేకర్స్. కానీ వీరి మూవీ ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లేలా కనిపించడం లేదు. ప్రస్తుతం షారుఖ్ పఠాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత షారుఖ్ అట్లీతో కలిసి పనిచేయబోతున్నారా అంటే సరైన క్లారిటీ లేదు. దీంతో అభిమానులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. షారుఖ్ కోసం అట్లీ ఇంకెంత కాలం వెయిట్ చేస్తాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ కాంబో నుంచి లెటేస్ట్ అప్ డేట్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో షారుఖ్ సరసన నటించే హీరోయిన్ గురించి జరుగుతున్నాయట. అయితే అందులో ఈసారి సౌత్ హీరోయిన్ తీసుకోవాలని భావిస్తున్నారట. షారుఖ్ సరసన నటించేందుకు లేడీ సూపర్ స్టార్ నయనతార ను సెలక్ట్ చేసుకోవాలనుకుంటున్నారట. మరోవైపు బీటౌన్ లో దీపికా పేరు కూడా బలంగా వినిపిస్తుంది. మరి ఈ మూవీలో హీరోయిన్ ఎవరనేది తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

Also Read: Suresh Raina Biopic: తెర‌పైకి సురేష్ రైనా బ‌యోపిక్‌.. లీడ్ రోల్‌లో న‌టించేదెవ‌రు.. రైనా అభిప్రాయం ఏంటి.?

Pooja Hegde Rashmika Mandanna: అమ్మో.. ఈ నాయిక‌ల స్ట్రాట‌జీలు మాములుగా లేవు.. ప‌క్కా ప్లానింగ్