Pooja Hegde Rashmika Mandanna: అమ్మో.. ఈ నాయిక‌ల స్ట్రాట‌జీలు మాములుగా లేవు.. ప‌క్కా ప్లానింగ్

గ్లామర్ 2020 క్యాలెండర్ తిరగేస్తే.. ఆ ఇద్దరి బొమ్మలే లార్జర్ దేన్ లైఫ్ సైజ్ లో కనిపిస్తాయి. పూజ హెగ్డే అండ్ రష్మిక... చెరో బ్లాక్ బస్టర్ ని తమ ఖాతాల్లో వేసుకుని.. ఇప్పుడు టాప్ రోలో నిలబడ్డారు....

Pooja Hegde Rashmika Mandanna: అమ్మో.. ఈ నాయిక‌ల స్ట్రాట‌జీలు మాములుగా లేవు.. ప‌క్కా ప్లానింగ్
Pooja Hegde, Rashmika Manda
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 25, 2021 | 9:57 PM

గ్లామర్ 2020 క్యాలెండర్ తిరగేస్తే.. ఆ ఇద్దరి బొమ్మలే లార్జర్ దేన్ లైఫ్ సైజ్ లో కనిపిస్తాయి. పూజ హెగ్డే అండ్ రష్మిక… చెరో బ్లాక్ బస్టర్ ని తమ ఖాతాల్లో వేసుకుని.. ఇప్పుడు టాప్ రోలో నిలబడ్డారు. మిగతా మార్కెట్లను కూడా టార్గెట్ చేసి దూసుకెళ్తున్నారు. కానీ.. ఆ ఒక్క విషయంలో మాత్రం చెరోవిధంగా ఆలోచిస్తున్నారు. ఎవరి లెక్క వారిదే అంటున్నారు. ఏమిటా ఒక్క విషయం? తెలుసుకుందాం ప‌దండి. బుట్టబొమ్మ బోర్డర్లు దాటి చాన్నాళ్లయింది. ఆమె డేట్స్ కోసం క్యూలు కట్టేవాళ్ళు పెరిగిపోతున్నారు. ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధేశ్యామ్.. హిందీలో రణ్వీర్ సింగ్ తో చేస్తున్న సర్కస్.. ఇవన్నీ దాదాపుగా కంప్లిషన్ స్టేజ్ లో వున్నాయి. రీసెంట్ గా విజయ్ తో అనౌన్స్ అయిన బీస్ట్, రేపటిరోజున సల్మాన్ మూవీ భాయ్ జాన్ ఇవి రెండు మాత్రమే పూజ కిట్టీలో మిగిలుంటాయి. తర్వాతనుంచి కేల్కులేషన్స్ పూర్తిగా మార్చేస్తున్నారట గద్దలకొండ శ్రీదేవి.

టాలీవుడ్ లో మరో మూడు బిగ్ బేనర్లు పూజ డేట్స్ కోసం అడ్వాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రెమ్యునరేషన్ విషయం పెండింగ్ లో ఉండడంతో అనౌన్స్ మెంట్స్ లేట్ అవుతున్నాయట. గతంలో కంటే.. 20 పర్సెంట్ శాలరీ ఇంక్రీజ్ చేయాలన్నది పూజ డిమాండ్. టోటల్ గా మూడున్నర కోట్లకు తగ్గేదే లేదన్నది అరవింద మాట. నిన్నటివరకూ పూజకు నియరెస్ట్ కాంపిటీటర్ గా వున్న రష్మిక లెక్క మాత్రం వేరేగా వుంది. రెండు కోట్లు తీసుకుంటున్నారటగా అని పొగరు మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అడిగితే.. ఇన్ కంటాక్స్ వాళ్ళు రైడ్ చేస్తారు.. అంటూ సర్కాస్టిక్ గా ఆన్సరిచ్చారు. సరిలేరు మూవీ తర్వాత చలో బ్యూటీ కాల్షీట్స్ రేట్స్ పెరిగాయన్నదైతే నిజం.

పుష్ప రెండు పార్థులకీ కలిపి 3 కోట్లు తీసుకుంటున్నట్టు టాక్. రీసెంట్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. అక్కడ పైసా కంటే నంబరాఫ్ ఛాన్సెస్ పెరిగితే చాలన్న స్ట్రాటజీతో ఉన్నారట. బీటౌన్లో గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాలకు కోటిన్నరకు మించి తీసుకోవడం లేదట కూర్గ్ గర్ల్. సో.. పూజాపైసా వసూల్ మీద లుక్కేస్తే… రష్మిక నెంబర్‌ ఆఫ్‌ మూవీస్‌ మీద కాన్‌సెన్‌ట్రేట్‌ చేస్తున్నారన్నమాట. ఎవరి స్టైల్‌ వాళ్లది.

Also Read: Chiranjeevi: నైన్టీస్‌లోనే బాలీవుడ్ మేగజైన్‌ కవర్‌పేజ్ ఎక్కేశారు.. ఆయ‌న‌కు పాన్ ఇండియా ఇమేజ్ ఓ లెక్కా..?

 ఫేట్ మార‌డంలేద‌ని రూటు మార్చిన రెజీనా.. ఇప్పుడైనా ల‌క్ క‌లిసొస్తుందా..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి