Megastar Chiranjeevi: నైన్టీస్‌లోనే బాలీవుడ్ మేగజైన్‌ కవర్‌పేజ్ ఎక్కేశారు.. ఆయ‌న‌కు పాన్ ఇండియా ఇమేజ్ ఓ లెక్కా..?

పాన్ ఇండియా స్టార్ అనే ఇమేజ్ మెగాస్టార్‌ని కూడా ఊరిస్తోంది. ఉత్తరాదిలో ట్రయల్స్ వేయడం ఆయనకు కొత్తేమీ కాకపోయినా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంకాస్త సీరియస్‌గా ట్రై చేస్తున్నారు చిరూ....

Megastar Chiranjeevi: నైన్టీస్‌లోనే బాలీవుడ్ మేగజైన్‌ కవర్‌పేజ్ ఎక్కేశారు.. ఆయ‌న‌కు పాన్ ఇండియా ఇమేజ్ ఓ లెక్కా..?
Chiranjeevi
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 25, 2021 | 8:59 PM

పాన్ ఇండియా స్టార్ అనే ఇమేజ్ మెగాస్టార్‌ని కూడా ఊరిస్తోంది. ఉత్తరాదిలో ట్రయల్స్ వేయడం ఆయనకు కొత్తేమీ కాకపోయినా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంకాస్త సీరియస్‌గా ట్రై చేస్తున్నారు చిరూ. బాలీవుడ్‌లో తనకున్న బేస్‌ని ఇంకాస్త గట్టిగా ఎస్టాబ్లిష్ చేసుకోడానికి మెగా ఎఫర్ట్స్ మళ్లీ మొదలయ్యాయట. బట్ ఫర్ ఏ ఛేంజ్ అంటూ తన లైనప్‌లో పెద్ద మార్పులే చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. నెక్ట్స్‌ మంత్ సెకండ్‌ వీక్‌లో ఆచార్య ఫైనల్ షెడ్యూల్ ఐపోగానే.. లూసీఫర్‌ సెట్స్ మీదికొస్తారన్నది నిన్నటిదాకా నడిచిన టాక్. ఆ తర్వాత వేదాళం రీమేక్‌ చేసి.. బాబీ సినిమాకు లాస్ట్‌ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నది ఫస్ట్ స్కెచ్. కానీ.. ఈ సీక్వెన్స్‌ని టోటల్‌గా మార్చేశారట చిరంజీవి.

జూలై లాస్ట్‌ వీక్‌లో బాబీ సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందట. అందుకే.. కాస్టింగ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. హీరోయిన్‌గా సోనాక్షి పేరు ఖరారైందని.. విలన్‌గా నవాజుద్దీన్‌ సిద్ధిఖి నటిస్తారని చెబుతున్నారు. పెదరాయుడు తరహా విలేజ్ లీడర్ రోల్‌లో చిరంజీవి నటిస్తున్న ఈ మూవీకి తెలుగులో వీరయ్య అనేది టెంటేటివ్ టైటిల్. ఇప్పుడు చేస్తున్న ఆచార్య.. పక్కా తెలుగు నేటివిటీతో వస్తున్న మూవీ. తర్వాత… లూసీఫర్ ఆల్రెడీ సౌత్‌లో ఇంట్రడ్యూస్ అయిన క్యారెక్టర్. మెహర్‌ రమేష్‌ చేస్తున్న వేదాళం రీమేక్‌ కూడా నార్త్‌ని ఎట్రాక్ట్ చేసే సబ్జెక్ట్ కాదట. అందుకే.. బాబీ సొంత కథతో చేస్తున్న మూవీతోనే బాలీవుడ్‌ని టార్గెట్ చేయబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి.

‘హీ ఈజ్ బిగ్ ఎట్ రెమ్యునరేషన్’ అనే క్యాప్క్షన్‌తో నైన్టీస్‌లోనే బాలీవుడ్ మేగజైన్‌ కవర్‌పేజ్‌మీద ఫ్లాష్ అయ్యారు మెగాస్టార్. అమితాబ్‌కి దీటుగా పేమెంట్ తీసుకునే వన్‌ అండ్‌ ఓన్లీ హీరోగా పేరుండేది చిరంజీవికి. రీసెంట్‌గా సైరా తో ఓ స్టెప్‌ వేశారు. ఇప్పుడు మరింత స్ట్రాంగ్‌గా గత వైభవాన్ని చాటుకునేందుకు ట్రై చేస్తున్నారు మెగాస్టార్. దానికి తగ్గట్టుగానే తన లైనప్‌ని డిజైన్ చేసుకుంటున్నారా…? అనేది పరిశ్రమలో వినిపిస్తున్న మాట.

Also Read: MAA elections 2021: ‘మా’ ఎన్నిక‌ల్లో ఎవ‌రి మ‌ద్ద‌తు ఎవ‌రివైపు.. ఓ లుక్కేద్దాం ప‌దండి

ఫేట్ మార‌డంలేద‌ని రూటు మార్చిన రెజీనా.. ఇప్పుడైనా ల‌క్ క‌లిసొస్తుందా..Chiru pan india movie