Python attack: జూకీపర్‌పై ఎటాక్ చేసిన భారీ కొండచిలువ.. రెప్పపాటులో ఏమైందంటే..? షాకింగ్ వీడియో

Python attacks zookeeper: సాధారణంగా పాములను చూస్తేనే మర పరిగెత్తుతాం.. అదే ఓ కొండచిలువను చూస్తే.. ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో మనం వర్ణించాల్సిన అవసరం లేదు. అయితే..

Python attack: జూకీపర్‌పై ఎటాక్ చేసిన భారీ కొండచిలువ.. రెప్పపాటులో ఏమైందంటే..? షాకింగ్ వీడియో
Python Attacks California Zookeeper
Follow us
Shaik Madar Saheb

| Edited By: Ravi Kiran

Updated on: Jun 26, 2021 | 1:20 PM

Python attacks zookeeper: సాధారణంగా పాములను చూస్తేనే మర పరిగెత్తుతాం.. అదే ఓ కొండచిలువను చూస్తే.. ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో మనం వర్ణించాల్సిన అవసరం లేదు. అయితే.. అలాంటి కొండ చిలువ దాడి చేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం చూడవచ్చు. కాలిఫోర్నియా జూకీపర్‌పై కొండచిలువ అకస్మాత్తుగా దాడి చేసింది. కొండచిలువ గుడ్లను ఇంక్యుబేటర్ లో ఉంచడానికి తీస్తుండగా.. జూకీపర్‌పై ఒక్కసారిగా కొండచిలువ ఎటాక్ చేసింది. ఈ భయంకరమైన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

పలు వైవిధ్యాలకు పేరుగాంచిన రెటిక్యులేటెడ్ కొండచిలువల పెంపకందారు జే బ్రూవర్.. కొండచిలువ గుడ్లను సేకరిస్తున్నాడు. ఈ క్రమంలో అతని చేతిలో ఉన్న స్టిక్‌ను పక్కన పెట్టి.. గుడ్లను చూపుతున్నాడు. ఈ క్రమంలో భారీ కొండచిలువ తన ముఖంపై ఎటాక్ చేసిందని.. జూకీపర్ ఇన్ స్టాగ్రామ్ వేదిక వీడియోను పంచుకున్నాడు. నేను రిస్క్ తీసుకొని మరి.. గుడ్లను సేకరించి ఇంక్యుబేటర్ లో సురక్షితంగా ఉంచినట్లు వెల్లడించారు. ఈ సందర్భంలో ఇలా జరిగిందంటూ బ్రూవర్ వెల్లడించాడు.

కొండచిలువ సరిగ్గా ముఖంపైకి వచ్చిందని.. తృటిలో తప్పించుకున్నట్లు బ్రూవర్ చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పంచుకోగానే లక్షలాది మంది వీక్షించి.. ఆందోళన వ్యక్తంచేశారు. షాకింగ్.. జాగ్రత్త అంటూ పలు కామెంట్లు సైతం పెడుతున్నారు. కాగా.. బ్రూవర్ కొండచిలువ దాడిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. మార్చిలో ఒక కొండచిలువ దాడి నుంచి తప్పించుకున్న వీడియోను సైతం అప్ లోడ్ చేశాడు. అప్పుడు కూడా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read:

Viral Video: ఖాళీ సిరంజితోనే వ్యాక్సిన్‌ వేసిన నర్సు..! వైరలవుతోన్న వీడియో

Viral Video: కంపెనీ సీయీవో తో వీడియో కాల్..అంతలో ఆమె ఒక్కసారిగా వెనక్కు పడిపోయింది.. అంతా షాక్.. ఏం జరిగిందంటే..