ENG vs SL: కాలితో రనౌట్ చేసిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్.. క్రికెట్‌లో ఫుట్‌బాల్‌ చూపించావంటూ నెటిజన్ల కామెంట్లు! వైరలవుతోన్న వీడియో

ఇంగ్లండ్‌, శ్రీలంక టీం ల మధ్య టీ20 సిరీస్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, గురువారం జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ సామ్ కరన్.. సూపర్ స్కిల్స్‌తో శ్రీలంక ఓపెనర్‌ దనుష్క గుణతిలకను పెవిలియన చేర్చాడు.

ENG vs SL: కాలితో రనౌట్ చేసిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్.. క్రికెట్‌లో ఫుట్‌బాల్‌ చూపించావంటూ నెటిజన్ల కామెంట్లు! వైరలవుతోన్న వీడియో
Sam Curran Shows Football Skills
Follow us
Venkata Chari

|

Updated on: Jun 26, 2021 | 7:01 AM

Sam Curran: ఇంగ్లండ్‌, శ్రీలంక టీం ల మధ్య టీ20 సిరీస్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, గురువారం జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ సామ్ కరన్.. సూపర్ స్కిల్స్‌తో శ్రీలంక ఓపెనర్‌ దనుష్క గుణతిలకను పెవిలియన చేర్చాడు. బాల్‌ను కాలితో తన్ని ఫుట్‌బాల్‌ ఆడావంటూ సరదగా నెటిజన్లు కామెంట్లు చేస్తూ.. ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. సామ్ కరన్ చేసిన అద్భుత ఫీల్డింగ్‌కు వావ్ అంటూ కొందరు, ఇలా కూడా ఔట్ చేస్తారా సామ్ అంటూ మరికొందరు.. క్రికెట్‌లో ఫుట్‌బాల్ చూపించావుగా నువ్ మాములోడివి కాదంటూ ఈ ఇంగ్లండ్ ఆల్ రౌండర్‌ ప్రతిభను మెచ్చుకుంటున్నారు. మ్యాచ్‌ విషయానికి వస్తే.. శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఆరభించింది. ఆదిలోనే సామ్ కరన్ అద్భుత స్టంట్ తో లంక టీంను బోల్తాకొట్టించాడు.

రెండో ఓవర్ లో సామ్ కరన్ బౌలింగ్ చేస్తున్నాడు. ఓపెనర్లుగా దనుష్క గుణతిలక, ఫెర్నాండో క్రీజులో ఉన్నారు. ఈ ఓవర్‌లో మూడో బంతిని ఫెర్నాండో షార్ట్ లెగ్ వైపు ఆడాడు. వెంటనే రన్‌ కోసం పరిగెత్తాడు. కానీ, బంతి పిచ్‌లోనే పడింది. ఇంతలో సామ్ కరణ్ పరుగెత్తుకుంటూ వచ్చి తన కుడి కాలుతో బంతిని గట్టిగా తన్నాడు. ఆ బంతి నేరుగా వెళ్లి మిడిల్ స్టంప్‌ను ముద్దాడింది. దీంతో నాన్ స్ట్రైకర్ అయిన దనుష్క గుణతిలక(3)కు షాకిస్తూ పెవిలియన్ చేర్చాడు. మనోడి ప్రతిభకు శ్రీలంక బ్యాట్స్‌మెన్స్ ఆశ్చర్యపోగా, ఇంగ్లండ్ టీం మెంబర్స్ పొగడ్తలతో ముంచెత్తారు. కామెంటేటర్లు ఏకంగా సామ్ కరణ్ యూరో యాక్షన్ చూడండంటూ రిప్లేలమీద రిప్లేలు వేశారు. ఈ వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. ఈమ్యాచ్‌లో 20 ఓవర్లలో శ్రీలంక టీం 7 వికెట్లు కోల్పోయి 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. కుశాల్ మెండీస్(39), కెప్టెన్‌ కుశాల్‌ పెరీరా (21) ఫర్వాలేదనిపించినా.. మిగతా బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లీష్ బౌలర్లలో మార్క్ వుడ్, రషీద్ తలో 2 వికెట్లు, సామ్‌ కరన్, క్రిస్ జోర్డాన్ చెరొక వికెట్ పడగొట్టారు.

112పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ టీం.. 12 ఓవర్లలో 4 వికెట్లకు 69 పరుగులతో కష్టపడుతోంది. ఇంతలో వర్షం మొదలైంది. దాంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం 18 ఓవర్లకు లక్ష్యాన్ని103 పరుగులుగా తేల్చారు. వర్షం పూర్తయ్యాక బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ జట్టు 16.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. 3 టీ20ల సిరీస్‌లో ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది.

Also Read:

IND vs ENG: గాయపడిన టీమిండియా పేస్ బౌలర్..! ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు డౌటేనా?

Virat Kohli: భారత సారథిని అవమానించిన న్యూజిలాండ్ వెబ్‌సైట్‌; విరాట్ ఫ్యాన్స్‌ ఆగ్రహం!

IND vs ENG: ప్రాక్టీస్‌ లేకే దెబ్బతిన్నామా? ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ముందు బీసీసీఐ కీలక నిర్ణయం!