AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ప్రాక్టీస్‌ లేకే దెబ్బతిన్నామా? ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ముందు బీసీసీఐ కీలక నిర్ణయం!

ఎన్నో ఆశలతో ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన కోహ్లీ సేనకు ఆదిలోనే పరాజయం ఎదురైంది. సరైన ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకపోవడంతో న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఘోర పరాజయం పాలైంది.

IND vs ENG: ప్రాక్టీస్‌ లేకే దెబ్బతిన్నామా? ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ముందు బీసీసీఐ కీలక నిర్ణయం!
Indian Cricket Team
Venkata Chari
|

Updated on: Jun 25, 2021 | 10:42 PM

Share

IND vs ENG: ఎన్నో ఆశలతో ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన కోహ్లీ సేనకు ఆదిలోనే పరాజయం ఎదురైంది. సరైన ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకపోవడంతో న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఘోర పరాజయం పాలైంది. అయితే, ఈ ఓటమిని విశ్లేషిస్తే… చాలా కారణాలు బయటపడతాయి. అందులో ముఖ్యమైనది ఆటగాళ్లకు తగినంత ప్రాక్టీస్ లేకపోవడమే. ఈ పరాజయంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆలోచనలో పడింది. త్వరలో జరిగే భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లోనూ ఇదే జరిగితే చాలా నష్టం వాటిల్లుతుందని అంతర్మధనంలో పడిందంట. ఈమేరకు ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు జరగనున్న 5 టెస్ట్‌ల సిరీస్ ప్రారంభానికి ముందు కొన్ని ప్రాక్టీస్ మ్యాచులు ఆడేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోందంట. ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఏర్పాటు చేయాలంటూ ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ)ను ఒప్పించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తోంది.

అయితే ఓ జట్టు విదేశాల్లో పర్యటించినప్పుడు.. అక్కడి ఫస్ట్‌క్లాస్ టీంలతో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడిస్తుంటారు. ఈ మ్యాచ్‌లతో పర్యాటక జట్టుకు కొంతమేర అక్కడి వాతావరణంతోపాటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లలో మంచి ప్రాక్టీస్ దొరుకుంది. అయితే కోవిడ్-19తో గతేడాది నుంచి పర్యాటక జట్లకు ప్రాక్టీస్ దొరకడం లేదు. బయోబుడలో ఉండాల్సి రావడం, కఠిన క్యారంటైన్ రూల్స్ పాటించడం లాంటి వాటితోనే ఇరు జట్లకు టైం సరిపోతోంది. దీంతో ప్రధాన సిరీస్‌లు, టోర్నీలలో సన్నాహక మ్యాచ్‌లు లేకుండానే బరిలోకి దిగాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆగస్టులో ప్రారంభమయ్యే ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ కు ముందు కూడా ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఏర్పాటు చేయలేదు. అలాగే బరిలోకి దిగడంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా ఓటమిపాలైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ జరిగేందుకు దాదాపు 40 రోజుల టైం ఉంది. అందుకే ఈ గ్యాప్‌లో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడితే బెటర్ అని బీసీసీఐ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ప్రాక్టీస్ మ్యాచ్‌లు కావాలని కోరినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈమేరకు ఈసీబీ ఛైర్మన్‌ ఇయాన్‌ వాట్‌మోర్‌, సీఈవో టామ్ హ్యారిసన్‌తో బీసీసీఐ కార్యదర్శి జై షా సన్నాహక మ్యాచుల గురించి మాట్లాడారని తెలుస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లపై రెండు రోజుల్లో ఓ ప్రకటన రాబోతోందని టాక్ నడుస్తోంది. ఒకవేళ ప్రాక్టీస్ మ్యాచ్‌లకు ఓకే అంటే మాత్రం కోహ్లీ సేనకు విరామం ఉండదు.

మరోవైపు ఇప్పటి వరకు బయోబుడగలో ఉన్న ఆటగాళ్లకు డబ్ల్యూటీసీ అనంతరం విరామం ప్రకటించారు. దీంతో ఆటగాళ్లు పరిసర ప్రాంతాల్లో సంచరించేందుకు అవకాశం దొరికింది. కానీ, డెల్టా వేరియంట్ తో బ్రిటన్‌లో కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో బీసీసీఐ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిస్థితి ప్రమాదకరంగా మారితే వెంటనే బయోబుడగలోకి రావాలని కోరినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

Also Read:

Sourav Ganguly: ‘సచిన్‌ అన్న మాటలు నాకింకా గుర్తున్నాయి’: 25 ఏళ్ల నాటి సంగతి గుర్తుచేసుకున్న గంగూలీ!

Kapil Dev: ఎప్పటికీ ఆ విజయమే వెరీ వెరీ స్పెషల్! ‘కపిల్స్ డెవిల్స్‌ ఆఫ్ 1983’ అంటూ ఫ్యాన్స్ సందడి

వీడెవడండీ బాబు.! ‘క్రిస్ గేల్’ తమ్ముడులా .. 10 బంతుల్లో 50 పరుగులు బాదేశాడు..