Virat Kohli: భారత సారథిని అవమానించిన న్యూజిలాండ్ వెబ్‌సైట్; విరాట్ ఫ్యాన్స్ ఆగ్రహం!
అసలే డబ్ల్యూటీసీ ఫైనల్ ఓడిపోయి బాధపడుతున్న విరాట్ కోహ్లీకి మరో అవమానం జరిగింది. కివీస్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో విరాట్‌పై విమర్శలు భారీగానే వస్తున్నాయి.
Virat Kohli: అసలే డబ్ల్యూటీసీ ఫైనల్ ఓడిపోయి బాధపడుతున్న విరాట్ కోహ్లీకి మరో అవమానం జరిగింది. కివీస్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో విరాట్‌పై విమర్శలు భారీగానే వస్తున్నాయి. మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. విరాట్ కోహ్లీని కెప్టెన్ నుంచి తప్పించాలని, ఐసీసీ ట్రోఫీల్లో కోహ్లీకి దారుణంగా విఫలమవుతున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కివీస్ కు చెందిన ఓ వెబ్‌సైట్ ‘దిఏసీసీఎన్‌జడ్’ పలు విమర్శలకు దారి తీసింది. భారత కెప్టెన్ విరాట్‌ను అవమానిస్తూ ఓ పోస్టు చేసింది. దీంతో విరాట్ అభిమానులు సదరు వెబ్‌సైట్‌ను టార్గెట్ చేసి దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ ఓడిపోయాక ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈఫొటోలో ఏముందంటే.. ఓ మనిషి మెకాళ్లపై కూర్చుని ఉండగా.. ఓ బెల్టుతో సదరు మనిషిని పట్టుకుని ఓ మహిళ ఉంటుంది. సదరు మహిళను కైల్ జేమీసన్‌తో పోల్చని ఆ వెబ్‌సైట్.. మోకాళ్లపై కూర్చున్న మనిషిని కోహ్లీతో పోల్చింది. దీంతో విరాట్ అభిమానులకు కాలింది. ఆ వెబ్ సైట్‌ను టార్గెట్ చేసి కామెంట్లతో చీల్చి చెండాడారు.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ రెండుసార్లు కైల్ జేమీసన్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. దీంతోనే సదరు వెబ్‌సైట్ ఇలా చేసిందని ఆవేదన చెందుతున్నారు. విరాట్ లాంటి ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్‌ను అవమానిచం ఏంటని, న్యూజిలాంట్ ప్లేయర్లను, సదరు వెబ్‌సైట్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. రిప్ పేజ్ అని కొందరు, బ్యాన్ చేయాలని మరికొందరు, వైరల్ కావడానికే ఇలా చేస్తున్నారంటూ రెచ్చిపోయారు. అలాగే జేమీసన్‌ను అమ్మాయితో పోల్చీ మీపరువే తీసుకున్నారంటూ కామెంట్లు చేశారు.
View this post on Instagram
Also Read:
IND vs ENG: ప్రాక్టీస్ లేకే దెబ్బతిన్నామా? ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ముందు బీసీసీఐ కీలక నిర్ణయం!
Sourav Ganguly: ‘సచిన్ అన్న మాటలు నాకింకా గుర్తున్నాయి’: 25 ఏళ్ల నాటి సంగతి గుర్తుచేసుకున్న గంగూలీ!