Kaleshwaram Project: ప్రపంచవ్యాప్తంగా మార్మోగిన ‘కాళేశ్వరం’ ఖ్యాతి.. డిస్కవరీ ఛానెల్‌లో డాక్యుమెంటరీ ప్రసారం..
Documentary on Kaleshwaram project: కోటి ఎకరాలకు నీళ్లిచ్చే లక్ష్యంతో సీఎం కే. చంద్రశేఖర్ రావు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ ప్రాజెక్టు గురించి డిస్కవరీ
Documentary on Kaleshwaram project: కోటి ఎకరాలకు నీళ్లిచ్చే లక్ష్యంతో సీఎం కే. చంద్రశేఖర్ రావు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ ప్రాజెక్టు గురించి డిస్కవరీ ఛానెల్‌లో ఓ డాక్యుమెంటరీ ప్రసారం అయింది. ప్రాజెక్టు అద్భుత ఘట్టాలను తెలుపుతూ.. శుక్రవారం రాత్రి 8 గంటలకు డిస్కవరీ తన డిస్కవరీ సైన్స్ ఛానెల్ లో ‘లిఫ్టింగ్ ఎ రివర్’ పేరిట ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ డాక్యుమెంటరీని ఇంగ్లీష్, తెలుగు, హిందీ సహా ఆరు భాషల్లో ప్రసారం చేశారు. దాదాపు మూడేళ్ల పాటు నిర్మించిన ప్రాజెక్టు గురించి అందులో పూర్తిగా వివరించారు. ఇంజనీరింగ్ వండర్ అంటూ ప్రశంసలు కురిపించింది డిస్కవరీ ఛానెల్. ప్రాజెక్టు కట్టిన తీరుతెన్నులను కళ్లకు కట్టినట్టు చూపించారు. 2017లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును కేవలం మూడేళ్లల్లో నిర్మించిన అద్భుత ఘట్టాలను వివరించారు. కాగా, ఈ డాక్యుమెంటరీని హైదరాబాద్ కు చెందిన కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స నిర్మించారు. ఇప్పటికే ఆయన పలు రచనల ద్వారా అనేక అవార్డులను గెలుచుకున్నారు. ఆసియా టెలివిజన్ అవార్డు, సింగపూర్ టెలీ అవార్డ్స్, ఇండియన్ టెలీ అవార్డ్స్, ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులను సైతం ఆయన సొంతం చేసుకున్నారు.
జల తెలంగాణను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నెరవేర్చే లక్ష్యంతో కేసీఆర్ ప్రాజెక్టుకు నిర్మించారు. సీఎం కేసీఆర్ మానసపుత్రికగా గుర్తింపు పొంది.. తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద నిర్మించిన ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు/కేఎల్ఐపి భారతదేశంలోనే కాక.. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును ప్రాణహిత, గోదావరి నదుల సంగమం వద్ద నిర్మించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ సంస్థ మేఘా ఇంజనీరింగ్& ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఓ భాగం అయింది.
Also Read: