AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China Bullet Train: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల దగ్గరలో చైనా బుల్లెట్ ట్రైన్..ఆక్రమిత టిబెట్ లో ప్రారంభం!

China Bullet Train: క్రమంగా ప్రపంచ శక్తిగా మారుతున్న చైనా ప్రపంచంతో పాటు భారత్‌కు పెద్ద ముప్పుగా మారుతోంది. ఆక్రమిత టిబెట్‌లో చైనా మొదటి ఎలక్ట్రిక్ బుల్లెట్ రైలును శుక్రవారం ప్రారంభించింది.

China Bullet Train: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల దగ్గరలో చైనా బుల్లెట్ ట్రైన్..ఆక్రమిత టిబెట్ లో ప్రారంభం!
China Bullet Train
KVD Varma
|

Updated on: Jun 25, 2021 | 8:54 PM

Share

China Bullet Train: క్రమంగా ప్రపంచ శక్తిగా మారుతున్న చైనా ప్రపంచంతో పాటు భారత్‌కు పెద్ద ముప్పుగా మారుతోంది. ఆక్రమిత టిబెట్‌లో చైనా మొదటి ఎలక్ట్రిక్ బుల్లెట్ రైలును శుక్రవారం ప్రారంభించింది. ఈ రైలు టిబెట్ రాజధాని లాసా నుండి నియాంగ్చి వరకు నడుస్తుంది. ఇది భారతదేశానికి ఒక హెచ్చరిక లాంటిదని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే నియాంచి నగర దూరం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు (మెచుకా) నుండి కేవలం 119 కిలోమీటర్లు మాత్రమే. చైనా ఎలక్ట్రిక్ బుల్లెట్ రైలు 435.5 కిలోమీటర్ల వరకు ప్రయాణించనుంది. కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల జ్ఞాపకార్థం దీనిని ప్రారంభించారు. దీని టాప్ స్పీడ్ 160 కి.మీ. దీని కోసం ఒక్క లైన్ మాత్రమే వేశారు. ఈ రైలు లాసా, షన్నన్, నియాంగ్చి స్టేషన్లతో సహా 9 స్టేషన్లలో ఆగుతుంది. లాసా నుండి నియాంగ్చికి రోడ్డు మార్గం గుండా ప్రయాణానికి పట్టే సమయాన్ని పోల్చి చూస్తే, బుల్లెట్ రైలు దాని కంటే 1.5 గంటల ముందుగా చేరుకుంటుంది. ఇది కాకుండా, షానన్ నుండి నియాంచి వెళ్ళడానికి 2 గంటల కన్నా తక్కువ సమయం పడుతుంది.

ఈ రైలు 47 సొరంగాలు, 121 వంతెనల గుండా వెళుతుంది. ఇది కాకుండా ఈ రైలు 16 సార్లు బ్రహ్మపుత్ర నదిని దాటుతుంది. సొరంగం, వంతెన యొక్క దూరాలను కలిపితే, అది రైల్వే లైన్ మొత్తం దూరంలో 75 శాతం ఉంటుంది. ఈ రైలు 10 మిలియన్ టన్నుల బరువును మోయగలదు. ఇది ప్రజలకు ప్రయాణాలను సులభతరం చేయడమే కాకుండా, వాణిజ్యాన్ని కూడా పెంచుతుందని చైనా భావిస్తోంది. టిబెట్‌లో చైనాకు ఇది రెండవ రైల్వే ప్రాజెక్టు. గతంలో చైనా క్వింగై నుండి లాసా వరకు మొదటి రైల్వే ప్రాజెక్టును ప్రారంభించింది. గత నవంబరు నెలలో, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ టిబెట్‌లో రైల్వే మార్గం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇలా చేయడం ద్వారా తమ సరిహద్దు బలపడుతుందని ఆయన చెప్పారు.

భారత్, చైనా మధ్య సరిహద్దులో వివాదాలు ఎక్కడ ఉన్నాయంటే..

గాల్వన్: ఇక్కడ పెట్రోలింగ్ ఇప్పుడు ఆగిపోయింది. టెన్షన్ లేదు. పెట్రోలింగ్ ఆపే విషయంలో ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం విడుదల కాలేదు.

పాంగోంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాలు: ఫిబ్రవరి 2021 లో, భారతదేశం, చైనా రెండూ ఈ ప్రాంతం నుండి వైదొలగడానికి అంగీకరించాయి. ఫింగర్ 8 వెనుక తాము ఉంటామని చైనా తెలిపింది, ఫింగర్ 4 (అనగా ధన్సింగ్ థాపా పోస్ట్) ను దాటి వెళ్ళదని భారత్ తెలిపింది,

గోగ్రా: ఇక్కడ ముఖ్యమైనది 17-ఎ లేదా సోగ్ సాలు పాయింట్. ప్రస్తుతం, భారతదేశం, చైనా సైనికులు ఇక్కడ ముఖాముఖిగా ఉన్నారు. భారతదేశంలోని చాలా మంది సైనికులు ఈ ప్రదేశంలో ఇప్పటికీ ఉన్నారు. ఈ ప్రాంతం నుండి రెండున్నర మూడు కిలోమీటర్ల వెనక్కి వెళ్లాలని భారత్ చైనాను అడుగుతోంది, అయితే చైనా దీనికి అంగీకరించడం లేదు.

Also Read: Viral Video: లైవ్ లో వార్తలు చదువుతూ..జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించిన న్యూస్ ప్రెజెంటర్.. తరువాత ఏమైందంటే..

H1B Visa: హెచ్‌-1బీ వీసా దారుల‌కు గుడ్ న్యూస్‌.. వీసా తిర‌స్క‌ర‌ణ‌కు గురైన వారికి మరో అవ‌కాశం ఇస్తూ..