AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart Phone Use effect: పెరిగిన మొబైల్, ల్యాప్ టాప్‌ల వినియోగం.. భూతంలా దృష్టి హీనత సమస్య

కరోనా సంక్షోభం కొత్త ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతోంది. లాక్‌డౌన్, వర్క్ ఫ్రం హోం కారణాలతో 2020లో మైబైల్ ఫోన్, కంప్యూటర్, ల్యాప్ టాప్ ల వినియోగం బాగా పెరిగింది. పిల్లలు, పెద్దలు మొబైల్, ల్యాప్‌టాప్‌లకు గంటల తరబడి అతుక్కుపోవడంతో కంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.

Smart Phone Use effect: పెరిగిన మొబైల్, ల్యాప్ టాప్‌ల వినియోగం.. భూతంలా దృష్టి హీనత సమస్య
Smart Phone effect
Janardhan Veluru
|

Updated on: Jun 25, 2021 | 8:57 PM

Share

కరోనా సంక్షోభం కొత్త ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతోంది. లాక్‌డౌన్, వర్క్ ఫ్రం హోం కారణాలతో 2020లో మొబైల్ ఫోన్, కంప్యూటర్, ల్యాప్ టాప్ ల వినియోగం బాగా పెరిగింది. ఇప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కొందరు ఉద్యోగులు గత 15 మాసాల కాలంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి చాలా మంది తమ ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ల కారణంగా చాలామంది ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు కూడా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. కరోనా కారణంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసుల మాధ్యమంగా బోధన జరుగుతోంది. ఆన్‌లైన్ క్లాసులకు విద్యార్థులు తమ దగ్గరున్న మొబైల్ ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌లతో హాజరవుతున్నారు. క్లాస్ ల అనంతరం కూడా వాటికే విద్యార్థుల అతుక్కుపోతున్నారు. గంటల తరబడి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో గడుపుతున్నారు. స్క్రీన్ టైమ్ చాలా పెరగడంతో విద్యార్థులు దృష్టి లోపాలకు గురవుతున్నారు. మరోవైపు ఇళ్లలో కాలక్షేపం కోసం పెద్దలు కూడా మొబైల్ ఫోన్, కంప్యూటర్, ల్యాప్ టాప్ తెరలకు అతుక్కుపోతున్నారు.

మొబైల్ ఫోన్, కంప్యూటర్, ల్యాప్ టాప్‌లతో గంటల తరబడి గడపడంతో వీరు కంటిచూపు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. బ్రిటన్ కు చెందిన సంస్థ ఫీల్ గుడ్ కాంటాక్ట్ చేపట్టిన అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.ప్రపంచ ఆరోగ్య సంస్థ లెన్సింట్ గ్లోబల్ హెల్త్, స్క్రీన్ టైం ట్రాకర్ అధారంగా ఫీల్ గుడ్ సంస్థ ఈ నివేదికను రూపొందించింది. అవసరానికి మించిన సమయం స్క్రీన్లపై గడుపుతున్న కారణంగా దేశంలో దాదాపుగా 27.50 కోట్ల మందికి దృష్టి క్షీణించిందని అధ్యయనంలో వెల్లడించింది. కళ్లద్దాలు ధరించాల్సిన పరిస్థితిలో దేశంలోని 23 శాతం జనాభా ఉన్నట్లు తెలిపింది. అప్పటికే కళ్లద్దాలు కలిగివున్న వారి సైట్ నంబర్ పెరిగిందని ఆ అధ్యయనం తేల్చింది.

Over screen time

Working On Computer

స్క్రీన్ టైంలో ఏడో స్థానంలో భారత్..

అవసరానికి మించిన సమయం స్క్రీన్లపై గడుపుతున్న కారణంగా చైనాలో 27.40 కోట్లు(14.1 శాతం) మంది దృష్టి హీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి ఉందని అధ్యయనంలో తేలింది. లాక్‌డౌన్ల కారణంగా మొబైల్స్, ల్యాప్ ట్యాప్, కంప్యూటర్లలో గేమ్స్ ఆడేవారి సంఖ్య, సినిమాలు చూసే వారి సంఖ్య పెరిగింది. అన్ని దేశాలకంటే భారత ప్రజలు ఎక్కువ ప్రభావితమవుతున్నారు. దేశంలో ల్యాప్ ట్యాప్ లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని అధ్యయనంలో తేలింది. మరోవైపు పెరిగిన మొబైల్స్ ఫోన్ల డేటా వినియోగం కూడా బాగా పెరిగింది. భారత్ లో ప్రతిరోజు స్క్రీన్ టైం ( మొబైల్స్, కంప్యూటర్స్, ల్యాప్ టాప్ లపై గడిపే సమయం) 6.30 గంటలుగా ఉంది. ప్రపంచ దేశాల స్క్రీన్ టైం తో పోలిస్తే భారత్ ఏడో స్థానంలో నిలుస్తోంది.

పలు దేశాల్లో స్క్రీన్ టైం.. దృష్టి హీనత కలిగిన జనాభా వివరాలు.. దేశం – స్క్రీన్ టైం – దృష్టి హీనత జనాభా భారత్ 6.36 గంటలు 22.7శాతం ద.ఆఫ్రికా 10.06 గంటలు 21.6శాతం ఇండోనేషియా 8.52 గంటలు 15.5శాతం థాయ్ లాండ్ 8.44 గంటలు 15.2శాతం వియత్నాం 6.47 గంటలు 14.9శాతం మలేషియా 9.17 గంటలు 14.4శాతం ఫిలిప్పీన్స్ 10.56 గంటలు 14.3శాతం చైనా 5.22 గంటలు 14.1శాతం

డబ్ల్యుహెచ్ ఓ సలహాలు… 2 ఏళ్ల వరకు పిల్లలను మొబైల్, టీవీ, ల్యాప్ టాప్, కంప్యూటర్ గ్యాడ్జెట్లకు దూరంగా ఉంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. 3-5 ఏళ్ల పిల్లలకు స్క్రీన్ టైం రోజుకు 1 గంట మించరాదు. 6-10 ఏళ్ల పిల్లలు స్క్రీన్ టైం రోజుకు 1 నుంచి 1.5 గంటలు పరిమితంకావాలి. 11-13 ఏళ్ల పిల్లలు స్క్రీన్ టైం రోజుకు 2 గంటలకంటే తక్కువ ఉండాలని సూచిస్తోంది. పెద్దలు స్క్రీన్ టైం 2 గంటలకు మించితే డేంజర్. మొబైల్ ఫోన్లను 10-12 అంగుళాల దూరంలో ఉంచి చూడటం వల్ల మయోపియా( దగ్గరి వస్తువులను చూడలేకపోవడం) సమస్య ఏర్పడుతుందని డబ్ల్యుహెచ్ఓ హెచ్చరించింది.

Also Read..

Viral Video: వేదికపై ఓ వ్యక్తి చెంప చెళ్లుమనిపించిన నవ వధువు.. కారణం ఏంటంటే..?

లైవ్ లో వార్తలు చదువుతూ..జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించిన న్యూస్ ప్రెజెంటర్.. తరువాత ఏమైందంటే..