తెలంగాణలో కోటి టీకా పంపిణీ పూర్తి.. క్షేత్రస్థాయి సిబ్బందిని అభినందించిన సీఎస్ సోమేశ్ కుమార్

ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా కోటి 53 లక్షల 358 మందికి టీకాలు డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. కోటికి పైగా వ్యాక్సిన్ విజయవంతం అవడంతో అధికారులు కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు.

తెలంగాణలో కోటి టీకా పంపిణీ పూర్తి.. క్షేత్రస్థాయి సిబ్బందిని అభినందించిన సీఎస్ సోమేశ్ కుమార్
Somesh Kumar
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 25, 2021 | 10:27 PM

కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తోంది. వ్యాక్సిన్ల కొరత లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కోవిడ్‌-19 టీకా డ్రైవ్‌లో మరో మైలురాయిని అధిగమించింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా కోటి 53 లక్షల 358 మందికి టీకాలు డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. కోటికి పైగా వ్యాక్సిన్ విజయవంతం అవడంతో అధికారులు కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ రోజు సాయంత్రం రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ కార్యాలయంలో రాష్టంలో కోటి మందికి టీకా వేయడం పూర్తియైన సందర్భంగా కేక్ కట్ చేసి ఆరోగ్య శాఖ అధికారులను,ఉద్యోగులను, క్షేత్రస్థాయి సిబ్బందిని, ఆశావర్కర్లను అభినందించారు.

ఈ సందర్భంగా మొబైల్ వ్యాక్సిన్ వ్యాన్‌ను ప్రారంభించారు. అదేవిధంగా వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన కల్పించెందుకు ఆరోగ్య శాఖ రూపొందించిన వీడియో సాంగ్ విడుదల చేశారు. ప్రజలందరు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీడియా తో మాట్లాడుతూ…. శుక్రవారం చారిత్రాత్మకమైన రోజు అని… కోటి టీకాలను ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో 2 కోట్ల 20 లక్షల మందికి కోవిడ్ టీకాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయిస్తే, ఒక కోటి మైలురాయిని అధిగమించినట్లు తెలిపారు. వారిలో 26 లక్షల మంది సూపర్ స్ర్పేడర్లకు టీకాలు వేసినట్లు వెల్లడించారు. ఈ క్యాటగిరిలలో మిగిలిపోయిన వ్యక్తులకు కోవిడ్ టీకాలు ఇచ్చుటకై 30 మోబైల్ వాహనాల ద్వారా పని ప్రదేశాలలోనే టీకాలు ఇస్తున్నట్లు తెలిపారు.

ఆదే విధంగా టీచర్లకు కూడా టీకాలు ఇస్తున్నట్లు తెలిపారు. 18 సంవత్సరము లు పైబడిన వయసు ఉన్న వ్యక్తులందరికి టీకాలు ఇచ్చు కార్యక్రమాన్ని కోనసాగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

ఇవి కూడా చదవండి : TPCC Women Congress President: చిక్కుముడి వీడింది.. టీపీసీసీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీత రావు నియామకం..

అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్