- Telugu News Photo Gallery Viral photos Viral photos qila mubarak fort is one of the oldest forts in india its history is very interesting
Viral Photos : భారతదేశంలోనే అత్యంత పురాతన కోట ఇదే..! దీని చరిత్ర ఎంతో ఆసక్తికరం.. మీరు తిలకించండి..
Viral Photos : భారతదేశం ఎన్నో ప్రాచీన సంప్రదాయలకు పెట్టింది పేరు. స్వాతంత్ర్యానికి పూర్వం మన దేశాన్ని ఎన్నో రాజవంశాలు పాలించాయి. వారు నిర్మించిన కట్టడాలు నేటికీ సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి..
Updated on: Jun 25, 2021 | 2:52 PM

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన భారతదేశంలో చాలా ప్రాచీన కోటలు ఉన్నాయి. వందల సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఉన్నాయి. భారతదేశ చరిత్రలో మొదటి కోటను ఎవరు నిర్మించారో మీకు తెలుసా?

పంజాబ్ లోని బతిండా నగరంలో ఉన్న 'కిలా ముబారక్' కోట అతి ప్రాచీన కోటగా చెప్పవచ్చు. ఈ కోట భారతదేశంలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన నిర్మాణంగా ఉంది. ఈ కోట 14 న్నర ఎకరాలలో విస్తరించి ఉంది.

ముస్లిం, టర్కిష్ చరిత్రకు మొదటి మహిళా పాలకుడు రజియా సుల్తానా అని అందరికి తెలుసు. ఈ కోటను రజియా సుల్తాన్ కోట అని కూడా పిలుస్తారు. ఇవే కాకుండా దీనికి బతిండా కోట, గోవింద్ఘర్, బక్రామ్‌ఘర్ అంటూ అనేక పేర్లు ఉన్నాయి.

పాటియాలాకు చెందిన మహారాజా కరం సింగ్ నిర్మించిన ఈ కోట లోపల గురుద్వార కూడా నిర్మించబడింది. ఒకప్పుడు మొఘల్ పాలకుడు బాబర్ కొన్ని ఫిరంగులతో ఈ కోటకు వచ్చాడని, అందులో నాలుగు ఫిరంగులు ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయని చెబుతారు.

ఈ కోటలో కుషన్ కాలం నాటి ఇటుకలు కనుగొనబడ్డాయి. ఈ కోట అసలు నిర్మాణం కనిష్క (క్రీ.పూ. 78 నుంచి క్రీ.శ 44 వరకు) కింగ్ డాబ్ చేత చేయబడిందని నమ్ముతారు. కోటను ఎవరు నిర్మించారో ఇప్పటికీ ఖచ్చితంగా చెప్పలేరు.





























