AP News: చెట్టు తొర్రలో భారీ గుడ్లు.. వాటిని పగలగొట్టి చూడగా స్థానికులు హడల్.!

AP News: కృష్ణా జిల్లా పొట్టిపాడు గ్రామంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు హడలెత్తిపోయారు. సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించారు.

AP News: చెట్టు తొర్రలో భారీ గుడ్లు.. వాటిని పగలగొట్టి చూడగా స్థానికులు హడల్.!
Eggs In Tree
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 25, 2021 | 11:33 AM

మాములుగా కొండచిలువను దూరం నుంచి చూస్తేనే భయంతో గజగజలాడిపోతాం. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు.. పదుల సంఖ్యలో కొండచిలువ పిల్లలు కనిపిస్తే ఇంకేమైనా ఉందా.! గుండె గుభేలుమంటుంది. ఈ షాకింగ్ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. ఒక్కసారిగా బయటపడ్డ కొండచిలువ పిల్లల్ని చూసిన ఆ ప్రాంతంలో నివసిస్తున్న స్థానికులు భయంతో హడలెత్తిపోయారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు మండలం పొట్టిపాడు గ్రామంలో కుప్పలు తెప్పలుగా కొండచిలువ పిల్లలు బయటపడటం కలకలం సృష్టించింది. పొట్టిపాడు ఏలూరు కాల్వ సమీపంలోని ఓ చెట్టు తొర్రలోంచి పదుల సంఖ్యలో భారీ గుడ్లను గ్రామస్థులు బయటికి తీశారు. వాటిని పగలగొట్టగా కొండచిలువ పిల్లలు బయటికి వచ్చాయి. కొండచిలువ పిల్లలు కనిపించటంతో అప్రమత్తమైన స్థానికులు.. వాటిని కొట్టి చంపారు. ఇక ఆ ప్రదేశంలో స్థానికులు మరి కాస్త లోతుగా తవ్వి చూడగా.. చెట్టు తొర్రలో ఆవాసం ఏర్పరుచుకున్న కొండచిలువ ఇక్కడే పెద్ద మొత్తంలో గుడ్లు పెట్టినట్లుగా గుర్తించారు. ఈ సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించారు. కాగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అటవీశాఖ అధికారులకు విషయాన్ని తెలియజేశారు. ఎన్నో ఏళ్లనాటి భారీ వృక్షం కావటంతో దాని వేర్లకింద కొండచిలువ ఆవాసం ఏర్పాటు చేసుకున్న విషయం ఎవరూ పసిగట్టలేకపోయినట్లు అధికారులు చెబుతున్నారు.

Also Read:

ఇంటి పైకప్పు తుడుస్తుండగా వర్కర్లకు షాక్.. పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి విస్తుపోయే విషయాలు.!

 ఆ ఒక్క చేప లక్షలు తెచ్చిపెట్టింది.. ఎంత ధర పలికిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి.!