SI Suspended: విధుల్లో నిర్లక్ష్యం వహించిన సబ్-ఇన్స్‌పెక్టర్‌పై వేటు.. సర్వీస్ రివాల్వర్ మిస్సింగ్ కేసులో సస్పెండ్!
ప్రజల వస్తువులకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ తన సర్వీసు రివాల్వర్‌నే పోగొట్టుకున్నాడు.
SI Suspended in Service Revolver Missing Case: ప్రజల వస్తువులకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ తన సర్వీసు రివాల్వర్‌నే పోగొట్టుకున్నాడు. దీంతో ఆయనను విధుల నుంచి తప్పించారు ఉన్నతాధికారులు. బదిలీ అవుతున్న సమయంలో తుపాకీ అప్పగించకుండా రిలీవ్ అయినందుకు సంబంధిత ఎస్‌ఐపై అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా.. అనంతపురం జిల్లా ధర్మవరం రూరల్ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న జనార్దన్ నాయుడిని తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలోని తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. అయితే, ధర్మవరం రూరల్ పీఎస్‌లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్‌ఐకి సర్వీసు రివాల్వర్ అందకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. డీఐజీ ఆదేశాల మేరకు జరిగిన విచారణలో తుపాకి అప్పగించలేదని.. రికార్డుల్లో నమోదు చేయలేదని తేలింది. స్టేషన్‌లో కూడా తుపాకీ లేదని నిర్ధారించుకున్న ఉన్నతాధికారులు.. జనార్దన్ నాయుడిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదిలావుంటే, అనంతపురం జిల్లా క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా జనార్దన్ నాయుడు పనిచేసే సమయంలో కీలకమైన కేసులను ఛేదించారు. వారి నుంచి ఎస్‌ఐకి ప్రాణహాని ఉండటంతో సొంత తుపాకీ అనుమతులు తీసుకుని వినియోగించారు. అక్కడ నుంచి ధర్మవరం రూరల్‌కు మారినప్పుడు అదే తుపాకీ వినియోగిస్తూ వచ్చారు. తిరుపతికి బదిలీ కావడంతో అలాగే వచ్చి విధుల్లో చేరిపోయారు. ధర్మవరం రూరల్‌లో ఉన్నంతకాలం సర్వీసు రివాల్వర్ తీసుకోవడం.. అప్పగించే విషయంలో అలసత్వం ప్రదర్శించినందుకు చర్యలు చేపట్టారు. కనిపించని తుపాకీ కోసం దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
Read Also….
Robbery : సింగిల్‌గా వచ్చాడు.. సింపుల్‌గా దోచుకెళ్లాడు.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు..