Reliance project: ఏపీలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటును విరమించుకున్న రిలయన్స్.. !
Reliance project: తిరుపతి సమీపంలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కోసం కేటాయించిన భూములను ఏపీ రాష్ట్ర మౌలిక సదుపాయల కల్పనకు రిలయన్స్..
Reliance project: తిరుపతి సమీపంలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కోసం కేటాయించిన భూములను ఏపీ రాష్ట్ర మౌలిక సదుపాయల కల్పనకు రిలయన్స్ ఇండస్ట్రీ వెనక్కి ఇచ్చేసింది. రూ.15 వేల కోట్ల పెట్టుడులతో సెట్‌టాప్ బాక్సులు, ఇంటర్నెట్ వినియోగానికి అవసరమైన డాంగిల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను సంస్థ రిలయన్స్ విరమించుకుంది. ఈ విషయాన్ని తిరుపతి ఏపీఐఐసీ జోనల్ కార్యాలయ ఉన్నతాధికారులు ధృవీకరించారు. అయితే భూముల కోసం సంస్థ డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు పరిశీలిస్తుట్లు తెలుస్తోంది. రిలయన్స్ సంస్థ గత ప్రభుత్వం 136 ఎకరాలను కేటాయించింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక అందులో 75 ఎకరాలను అప్పగించింది. రిలయన్స్‌కు కేటాయించిన భూములకు సంబంధించిన 15 మంది రైతులు వివిధ కారణాలతో కోర్టులో కేసులు వేశారు. ఇలా సుమారు 50 ఎకరాలు వివాదంలో ఉన్నాయి. కేసులు పరిష్కారం అయ్యే వరకు యూనిట్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండదు. దీంతో రిలయన్స్ తన ప్రాజెక్టు ఏర్పాటును విరమించుకుంది.
ప్రత్యామ్నాయంగా వడమాలపేట మండలం పాడిరేడు అరణ్యం దగ్గర ఎలాంటి వివాదాలు లేని భూములను కేటాయిస్తామని ఏపీఐఐసీ అధికారులు ప్రతిపాదించారు. ఆ భూములనే తిరుమల దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం ఇటీవల కేటాయించింది. ‘సెట్‌టాప్ బాక్సుల అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను రిలయన్స్ సంస్థ విరమించింది.