Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Business Loan: గుడ్‌న్యూస్‌.. ఎస్‌బీఐ మరో కొత్త లోన్‌ స్కీమ్‌.. వీరు సులభంగా రుణం పొందవచ్చు..!

SBI Business Loan: దేశీ అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) కస్టమర్లకు ఎన్నో రకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. రుణాలకు సంబంధించిన..

SBI Business Loan: గుడ్‌న్యూస్‌.. ఎస్‌బీఐ మరో కొత్త లోన్‌ స్కీమ్‌.. వీరు సులభంగా రుణం పొందవచ్చు..!
Sbi Business Loan
Subhash Goud
|

Updated on: Jun 25, 2021 | 8:07 AM

Share

SBI Business Loan: దేశీ అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) కస్టమర్లకు ఎన్నో రకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. రుణాలకు సంబంధించిన కొత్త కొత్త స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా రుణాలు అందించేందుకు ఆరోగ్యమ్ లోన్ అనే పేరుతో కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టింది ఎస్‌బీఐ. ఇది కొత్త బిజినెస్ లోన్ స్కీమ్. ఇందులో భాగంగా హెల్త్ ‌కేర్ రంగంలో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు సులభంగా రుణాలు పొందే అవకాశం ఉంటుంది.

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ కొత్త స్కీమ్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్‌బీఐ తెలిపింది. క్యాష్ క్రెడిట్, టర్మ్ లోన్, బ్యాంక్ గ్యారంటీ, లెటర్ ఆఫ్ క్రెడిట్ వంటి వాటి రూపంలో ఈ కొత్త బిజినెస్ లోన్ పొందొచ్చని వెల్లడించింది.

ఆస్పత్రి, నర్సింగ్‌హోమ్స్‌, డయగ్నోస్టిక్‌ సెంటర్లు, పాథాలని ల్యాబ్స్, మ్యనుఫ్యాక్చరర్స్, సప్లయర్స్, ఇంపోర్టర్స్, హెల్త్ కేర్ సప్లై లాజిస్టిక్ సంస్థలు వంటివి రూ.100 కోట్ల వరకు రుణం పొందవచ్చని తెలిపింది. అయితే తీసుకున్న రుణాన్ని పదేళ్ల లోపు మళ్లీ తిరిగి చెల్లించే వెసులుబాటు ఉంటుంది.

రూ.2 కోట్ల రుణం పొందేందుకు..

కాగా, రూ.2 కోట్ల వరకు రుణం పొందాలనుకుంటే సదరు కస్టమర్‌ ఎలాంటి తనఖా పెట్టాల్సిన అవసరం లేదని ఎస్‌బీఐ తెలిపింది. కరోనా నేపథ్యంలో గత ఏడాది కాలం నుంచి హెల్త్ కేర్ రంగం దేశానికి దన్నుగా నిలుస్తోందని, అందుకే ఈ రంగానికి సులభంగానే రుణాలు అందించేందుకు ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని ఎస్‌బీఐ తెలిపింది. కాగా, స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే ఎన్నో రకాల స్కీమ్‌లను ప్రవేశపెట్టి సులభమైన రుణాలను అందిస్తోంది. సామాన్యుడి నుంచి వ్యాపారవేత్తల వరకు చాలా రకాల రుణాలు అందిస్తోంది. కోవిడ్‌ను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆర్థికంగా ఎదిగేందుకు ఇలాంటి రుణాలు అందిస్తోంది. కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని రుణాలతో పాటు తన సర్వీసులను కూడా సులభతరం చేసింది.

ఇవీ కూడా చదవండి

SBI కస్టమర్లకు గుడ్‏న్యూస్.. అందుబాటులోకి కొత్త క్రెడిట్ కార్డ్స్.. అదిరిపోయే బెనిఫిట్స్.. వీరికి అనుగుణంగా..

Tea Price: దేశంలో గతేడాది కంటే 25 శాతం పెరిగిన టీ ధరలు..ఎగుమతులపై ధరల ప్రభావం..వచ్చే నెలలో తగ్గే అవకాశం!

డ్రైవింగ్‌ లైసెన్స్‌లో ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారో తెలుసా?
డ్రైవింగ్‌ లైసెన్స్‌లో ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారో తెలుసా?
అతడికి 19, ఆమెకు 38..వింత లవ్ స్టోరీ వీడియో
అతడికి 19, ఆమెకు 38..వింత లవ్ స్టోరీ వీడియో
బిస్కెట్లు కూడా తింటున్నారా? ఈ అలవాటును త్వరగా మానేయండి
బిస్కెట్లు కూడా తింటున్నారా? ఈ అలవాటును త్వరగా మానేయండి
భర్త నాలుకను కొరికి నమిలేసిన భార్య.. ఆ తర్వాత ఆస్పత్రిలో మరో సీన్
భర్త నాలుకను కొరికి నమిలేసిన భార్య.. ఆ తర్వాత ఆస్పత్రిలో మరో సీన్
నడిరోడ్డులో గుర్రాల ఘర్షణ.. ఆ తర్వాత ఏమైందంటే వీడియో
నడిరోడ్డులో గుర్రాల ఘర్షణ.. ఆ తర్వాత ఏమైందంటే వీడియో
వంటకు అల్యూమినియం పాత్రల కంటే ఇత్తడి పాత్రలు మంచివి.. ఎందుకంటే
వంటకు అల్యూమినియం పాత్రల కంటే ఇత్తడి పాత్రలు మంచివి.. ఎందుకంటే
పసుపు, ఆకుపచ్చ, తెలుపు... ఏ గుమ్మడికాయ ఆరోగ్యానికి మంచిదో తెలుసా?
పసుపు, ఆకుపచ్చ, తెలుపు... ఏ గుమ్మడికాయ ఆరోగ్యానికి మంచిదో తెలుసా?
మళ్లీ భగ్గుమన్న బంగారం ధరలు.. కొన్ని గంటల్లోనే రేట్లు తారుమారు..
మళ్లీ భగ్గుమన్న బంగారం ధరలు.. కొన్ని గంటల్లోనే రేట్లు తారుమారు..
రెండో పెళ్లికి రెడీగా సమంత..ప్లాన్ మాములుగా లేదుగా వీడియో
రెండో పెళ్లికి రెడీగా సమంత..ప్లాన్ మాములుగా లేదుగా వీడియో
1000కి పైగా సినిమాలు.. ప్రతి పాత్రకు ప్రాణం పోసింది..
1000కి పైగా సినిమాలు.. ప్రతి పాత్రకు ప్రాణం పోసింది..