AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naandhi Movie: ‘నాంది’ హిందీ రీమేక్.. బాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి నిర్మించనున్న దిల్ రాజు..

గత కొన్ని సంవత్సరాలుగా ప్లాపులతో నెట్టుకోస్తున్న హీరో అల్లరి నరేష్ కు 'నాంది' సినిమా సూపర్ హిట్ ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన

Naandhi Movie: 'నాంది' హిందీ రీమేక్.. బాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి నిర్మించనున్న దిల్ రాజు..
Naandhi
Rajitha Chanti
|

Updated on: Jun 25, 2021 | 1:43 PM

Share

గత కొన్ని సంవత్సరాలుగా ప్లాపులతో నెట్టుకోస్తున్న హీరో అల్లరి నరేష్ కు ‘నాంది’ సినిమా సూపర్ హిట్ ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. న్యాయవ్యవస్థలోని లోపాలనే కాకుండా.. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 211 ద్వారా ఎలాంటి న్యాయం పొందవచ్చే ప్రేక్షకుల అర్థమయ్యేలా చెప్పిన సినిమా నాంది. ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించగా.. సతీష్ వేగేశ్న నిర్మించారు. ఈ మూవీ తమిళ, కన్నడ, మలయాళ రీమేక్ హక్కులను దిల్ రాజు అప్పుడే సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన ఈ చిత్రాన్ని హిందీలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ తో కలిసి మొదలు పెట్టబోతున్నారు.

ఈ విషయాన్ని అజయ్ దేవ్ గన్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి నాంది సినిమాను రీమేక్ చేయబోతున్నట్లుగా తెలిపారు. ఇక ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన వివరాలను ప్రకటించనున్నారు. ఇక దిల్ రాజ్ ఇప్పటికే బాలీవుడ్ లో లైక్ మైండెడ్ ప్రొడ్యూసర్స్ తో కలిసి వరుసగా తెలుగు సినిమాలను రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే జెర్సీ సినిమాను రీమేక్ చేస్తున్న దిల్ రాజు .. త్వరలో హిట్, ఎప్ 2 సినిమాలను రీమేక్ చేయనున్నారు.

ట్వీట్..

Also Read: MPTC ZPTC Counting: ఏపీ పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌పై ఇంకా సస్పెన్స్‌.. వచ్చే నెల 27న సమగ్ర విచారణ జరుపుతామన్న ధర్మాసనం

Srinivas goud : న‌ర‌రూప రాక్ష‌సుడు.. పాల‌మూరు ప్ర‌జ‌లు వ‌ల‌స పోవ‌డానికి కారకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి : మంత్రి శ్రీనివాస్ గౌడ్