Instagram: డెస్క్‌టాప్ నుంచి ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు.. ఎలా చేయాలో తెలుసా?
ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయాలంటే కేవలం మొబైల్ నుంచి మాత్రమే సాధ్యమయ్యేది. అయితే ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చిన కొత్త ఆఫ్షన్‌తో ఇకనుంచి డెస్క్‌టాప్ నుంచి కూడా పోస్టులు చేయవచ్చు.
Instagram: ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయాలంటే కేవలం మొబైల్ నుంచి మాత్రమే సాధ్యమయ్యేది. అయితే ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చిన కొత్త ఆఫ్షన్‌తో ఇకనుంచి డెస్క్‌టాప్ నుంచి కూడా పోస్టులు చేయవచ్చు. పీసీలో ఉన్న ఫొటోలు, వీడియోలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకోవచ్చు. అయితే ఐప్యాడ్‌లో మాత్రం ఇప్పటికీ ఇలాంటి ఫీచర్ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇన్‌స్టాగ్రామ్ డెస్క్‌టాప్ వెబ్‌సైట్ నుంచి మొబైల్ లో వాడినట్లే.. ఫిల్టర్లను ఉపయోగించి ఫోటోలను, వీడియోలను ఎడిట్ చేసుకుని షేర్ చేసుకోవచ్చు. గతనెలలో ఇన్‌స్టాగ్రామ్ ఇలాంటి ఫీచర్‌పై పనిచేస్తుందనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఓ టిప్‌స్టర్ డెస్క్‌టాప్ నుంచి పోస్టులను క్రియోట్ చేస్తున్న కొన్ని స్క్రీన్‌షాట్లను విడుదల చేశాడు.
అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం అందరికీ అందుబాటులో లేదని తెలుస్తోంది. కొంతమంది యూజర్లకే ఇది అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పీచర్‌ను మొదట మాట్ట్ నవర్రా(@MattNavarra) గుర్తించాడు. టెస్టింగ్‌లో భాగంగా కొంతమంది యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ డెస్క్‌టాప్ వెబ్‌సైట్‌లో పోస్టులను క్రియోట్ చేయడం, ఎడిట్, పబ్లిష్ చేయడం అంతా మొబైల్ యాప్‌లో చేసినట్లుగానే ఉండనుంది.
డెస్క్‌టాప్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలా పోస్ట్ చేయాలో చూద్దాం..
– ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ముందుగా లాగిన్ చేశాక, కుడివైపున గల +(Plus) ప్లస్ సింబల్‌ను క్లిక్ చేయాలి. – ఆ తరువాత పీసీ నుంచి ఫొటోను లేదా వీడియోను ఓపెన్ చేయాలి. – ఫొటో అప్‌లోడ్ అయ్యాక, క్రాపింగ్ కోసం నాలుగు సైజులు కనిపిస్తాయి. (ఒరిజినల్, స్క్వేర్ (1: 1), పోర్ట్రెయిట్ (4: 5), ల్యాండ్‌స్కేప్ (16: 9) )వీటినుంచి ఏదో ఒకదానిని ఎంచుకోవాలి. – ఆ తరువాత ఫిల్టర్లను ఎంచుకుని ఫొటోలను మార్చుకోవాలి. అలాగే వీటితోపాటు కలర్, బ్రయిట్‌నెస్, కాంట్రాస్ట్ లాంటి ఆఫ్షన్లను ఉపయోగించుకోవచ్చు. – వీడియోలను పోస్టు చేయాలంటే ఇంకొన్ని ఆఫ్షన్లను వాడుకోవాల్సి ఉంటుంది. ఫొటోలతో పోల్చితే కొంచెం భిన్నంగా ఉంటుంది. వీడియోని సెలక్ట్ చేశాక, ఫ్రేమ్‌లను ఎంచుకోవాలి. నచ్చిన ఫ్రేమ్ ను ఎంచుకుని, సౌండ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. – ఇలా రెడీ చేసిన ఫొటోలు లేదా వీడియోలకు క్యాప్షన్, లొకేషన్, ఇంకాస్త టెక్ట్ యాడ్ చేసుకోవాలి. అనంతరం ఇతర యూజర్లకు టాగ్ చేయాలనుకుంటే వారి ప్రొఫైల్ నేమ్‌లతో టాగ్ చేయాలి. అంతా పూర్తయ్యాక పబ్లిస్ చేయాలి. ఒకవేళ పోస్టులకు కామెంట్లు వద్దనుకుంటే మాత్రం.. టర్న్ ఆఫ్ కామెంటింగ్ ఆఫ్షన్‌ను ఎంచుకోవాలి.
More screenshots of creating + publishing posts via https://t.co/3QaHTLlqBE pic.twitter.com/G5mptOhN06
— Matt Navarra (@MattNavarra) June 24, 2021
Also Read:
Komaki Electric Scooter : ఈ కంపెనీ స్కూటర్‌పై రూ.20,000 తగ్గింపు..! అవకాశం కొన్నిరోజులు మాత్రమే..
Windows 11: ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన విండోస్ 11; అందుబాటులోకి ఎప్పుడంటే..?