Poco x3 GT: విడుదలకు ముందే లీకైన పోకో ఎక్స్3 జీటీ ఫీచర్లు..!

పోకో త్వరలో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. పోకో ఎక్స్3 జీటీ పేరుతో విడుదల కానున్న ఈ ఫోన్‌ మొదట మలేషియాలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Poco x3 GT: విడుదలకు ముందే లీకైన పోకో ఎక్స్3 జీటీ ఫీచర్లు..!
Poco X3 Gt
Follow us
Venkata Chari

|

Updated on: Jun 27, 2021 | 2:53 PM

Poco x3 GT: పోకో త్వరలో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. పోకో ఎక్స్3 జీటీ పేరుతో విడుదల కానున్న ఈ ఫోన్‌ మొదట మలేషియాలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోన్‌ రెడ్ మీ నోట్ 10 ప్రో ఫోన్‌కు రీబ్రాండెడ్ గా రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. మలేషియన్ సిరిమ్ సర్టిఫికేషన్ మేరకు ఈ ఫోన్ 21061110AG మోడల్ విడుదల కానుందంట. దీనిని మొదట మైస్మార్ట్‌ప్రైస్ గుర్తించింనట్లు పేర్కొంది. అయితే ఈ సర్టిఫికేషన్‌లో ఎటువంటి ఫీచర్లను మాత్రం ప్రకటించలేదు. ఈ ఫోన్ గతంలో యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ వెబ్‌సైట్లో దర్శనమిచినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. ఈ ఫోన్‌కు సంబంధించిన కనెక్టివిటీ ఆప్షన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. పోకో ఎక్స్3 జీటీ టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ ను సొంతం చేసుకుందని టిప్‌స్టర్ ముకుల్ శర్మ పేర్కొన్నాడు.

ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 11 లో కొన్ని మార్పుల చేయడంతో ఈ ఓఎస్‌ను పోకో రూపుదిద్దింది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్ ప్లేతో రానుందని లీకులు చెబుతున్నాయి. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుందని, ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1100 ప్రాసెసర్‌పై విడుదల కానున్నట్లు తెలుస్తోంది. పోకో ఎక్స్3 జీటీ లో 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ఉండనుందని సమాచారం. జేబీఎల్ ఆడియో స్పీకర్లతో విడుదల కానున్నట్లు సమాచారం.

ఈ ఫోన్‌లో వెనకవైపు 3 కెమెరాల సెటప్ ఉండనుంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ తోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ టెర్టియరీ మాక్రో సెన్సార్ ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరాను ముందుభాగంలో అందించనున్నారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో రానున్న ఈ ఫోన్‌ 67W ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, వైఫై 6, బ్లూటూత్ 5.2, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉండనున్నాయి.

Also Read:

RealMe: ఏడువేల రూపాయలకే రియల్ మీ కొత్త బడ్జెట్ ఫోన్..సి 11 (2021)..ఈ ఫోన్ ఎలా ఉంటుందంటే..

Skoda Kushaq: జూన్‌ 28 నుంచి స్కోడా కుషాక్ బుకింగ్‌లు; డెలివరీలు ఎప్పుడంటే..?

Techno Phantom X: మార్కెట్లోకి టెక్నో కంపెనీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచ‌ర్లు ఈ ఫోన్ సొంతం..

Realme Laptop with Windows 11: విండోస్ 11 తో రానున్న రియల్‌మీ ల్యాప్‌టాప్..!