Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cauliflower Crop : కాలీఫ్లవర్‌ పంటతో మంచి లాభాలు..! జూన్ – జూలై తగిన సమయం.. తక్కువ పెట్టుబడి అధిక రాబడి..

Cauliflower Crop : మన దేశంలో కూరగాయలు లేనిదే రోజు గడవదు. సాధారణంగా చల్లటి వాతవరణంలో రైతులు

Cauliflower Crop : కాలీఫ్లవర్‌ పంటతో మంచి లాభాలు..! జూన్ - జూలై తగిన సమయం.. తక్కువ పెట్టుబడి అధిక రాబడి..
Cauliflower Crop
Follow us
uppula Raju

|

Updated on: Jun 29, 2021 | 9:53 PM

Cauliflower Crop : మన దేశంలో కూరగాయలు లేనిదే రోజు గడవదు. సాధారణంగా చల్లటి వాతవరణంలో రైతులు కాలీఫ్లవర్ పండిస్తారు. అయితే ఈ సంవత్సరం కాలీఫ్లవర్‌ మెరుగైన రకాలు వచ్చాయి. వీటిని రైతు సోదరులు రెండో సీజన్లో కూడా పండిస్తున్నారు. కాలీఫ్లవర్ ప్రారంభ దశలో ధర ఎక్కువగా ఉంటుంది. కానీ సరఫరా పెరిగేకొద్దీ ధరలు తగ్గుతాయి. అటువంటి పరిస్థితిలో రైతులకు కొద్ది రోజులు మాత్రమే ప్రయోజనం లభిస్తుంది. కొన్నిసార్లు కాలీఫ్లవర్ ధర పడిపోతుంది. రైతులు ఖర్చును భరించలేకపోతారు. అందుకే వ్యవసాయ శాస్త్రవేత్తలు కొన్ని మెరుగైన రకాలను అభివృద్ధి చేశారు. జూన్-జూలై నెలలో కూడా రైతులు వీటని పండించవచ్చు. ఈ సమయంలో కాలీఫ్లవర్ మార్కెట్లో అందుబాటులో ఉండదు. ఈ కారణంగా వారు ఎక్కువ సంపాదించడానికి అవకాశం ఉంటుంది.

ఈ రకాలను ఎంచుకోండి ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ప్రభుత్వ శాస్త్ర విభాగానికి చెందిన వ్యవసాయ నిపుణుడు డాక్టర్ శ్రావన్ సింగ్ మాట్లాడుతూ ఈ రకాన్ని జూన్-జూలై నెలలో విత్తుతారు. అక్టోబర్ నాటికి ఇది సిద్ధమవుతుంది. దీంట్లో మెరుగైన రకాలు ఉన్నాయని పూసా మేఘనా, పూసా అశ్విని, పూసా కార్తీక్, పూసా కార్తీక్ హైబ్రిడ్ అని వివరించారు. ఈ రకాలను నాటడం ద్వారా రైతులు కాలీఫ్లవర్ నుంచి బాగా సంపాదించవచ్చన్నారు. ఈ రకాల సాగు కోసం పొలం నీటితో నిండిపోకూడదని రైతు సోదరులు గుర్తుంచుకోవాలి. పురుగులు సమస్యలు ఉన్న పొలంలో కూడా ప్రారంభ కాలీఫ్లవర్ విత్తకూడదు. మీరు కాలీఫ్లవర్ పంటను పండిస్తున్న క్షేత్రాన్ని ముందుగానే శుద్ధి చేయాలి.

సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతులు 100 కిలోల ఆవు పేడలో ఒక కిలో టైకోడెర్మాను కలిపి 7 నుంచి 8 రోజులు ఉంచాలి. ఆ తరువాత పొలంలో కలిపి దున్నాలి. ప్రారంభ కాలీఫ్లవర్ మొలకలు 40-45 రోజుల్లో సిద్ధమవుతాయి. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. సమయానికి కలుపు తీయడం మరిచిపోవద్దు. కీటకాలు లేదా వ్యాధి సోకితే స్ప్రే చేయాలి. రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రారంభ కాలీఫ్లవర్ ఉపయోగపడుతుంది.

Senior Citizen Scheme : ఖాతాదారులకు గమనిక..! సీనియర్ సిటిజన్ స్కీంను పొడగించిన బ్యాంకులు..

Shivathmika Rajashekar: కోలివుడ్‏లో శివాత్మిక దూకుడు… సెట్స్ పై ఫస్ట్ మూవీ… మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్..

David Warner: ‘ఆర్ఆర్ఆర్’ పోస్టర్‏ను వదలని డేవిడ్ వార్నర్.. ఈసారి తోడుగా సన్ రైజర్స్ కెప్టెన్ కూడా… ఫోటో వైరల్..