Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

David Warner: ‘ఆర్ఆర్ఆర్’ పోస్టర్‏ను వదలని డేవిడ్ వార్నర్.. ఈసారి తోడుగా సన్ రైజర్స్ కెప్టెన్ కూడా… ఫోటో వైరల్..

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ డెవిడ్ వార్నర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే వార్నర్ కూడా హైదరాబాద్ సన్ రైజర్స్ కెప్టెన్ గా

David Warner: 'ఆర్ఆర్ఆర్' పోస్టర్‏ను వదలని డేవిడ్ వార్నర్.. ఈసారి తోడుగా సన్ రైజర్స్ కెప్టెన్ కూడా... ఫోటో వైరల్..
David Warner
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 29, 2021 | 9:12 PM

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ డెవిడ్ వార్నర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే వార్నర్ కూడా హైదరాబాద్ సన్ రైజర్స్ కెప్టెన్ గా వ్యహరించినప్పటి నుంచి తెలుగు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన పలువురు హీరోలను ఫాలో అవుతూ.. వారి పాటలకు తనదైన స్టైల్లో స్పేప్పులెస్తూ ఆశ్చర్యపరిచాడు. గతంలో మహేష్ బాబు, చిరంజీవి, అల్లు అర్జున్ వంటి హీరోల ముఖాలను రీఫేస్‌ యాప్‌ సహాయంతో మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా వార్నర్ జక్కన్న రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను కూడా ఉపయోగించేసాడు.

మంగళవారం ఆర్ఆర్ఆర్ టీం.. ఎన్టీఆర్, రామ్ చరణ్ బైక్ పై వెళ్తున్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోను మార్ఫింగ్ చేసిన 34 ఏళ్ల వార్నర్.. బైక్ నడుపుతున్న ఎన్టీఆర్‌ తలకు బదులుగా తన సహచరుడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్ తలను తగిలించాడు. వెనక కూర్చున్న రామ్ చరణ్ తలకు బదులుగా తన ఫొటోను తగిలించి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు.ఈ పోస్టు చూసిన వెంటనే అభిమానులకు కామెంట్లతో ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఫొటోను చూసిన ఎస్ఆర్ఎస్ సహచరుడైన రషీద్ ఖాన్ వెంటనే స్పందించాడు. ‘హెల్మెట్ గైస్’ అంటూ ట్రోల్ చేశాడు. వెంటనే స్పందించిన వార్నర్.. ‘నువ్వు కూడా రషీద్ భాయ్’ అని కామెంట్ చేశాడు.

ఇదిలా ఉంటే.. ఇదే ఫోటో చూసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. న్టీఆర్, రామ్‌చరణ్ ఫొటోలకు హెల్మెట్లు పెట్టి ఇప్పుడు సంపూర్ణంగా ఉందని ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్‌గా ఆర్ఆర్ఆర్ బృందం మరో ట్వీట్ చేస్తూ ఇది పరిపూర్ణంగా లేదని, నంబరు ప్లేట్ మిస్సయిందని గుర్తు చేశారు. మధ్యలో కల్పించుకున్న అభిమానులు ఆ బైక్‌కు హెడ్‌లైట్ కూడా లేదని సరదా కామెంట్స్ చేశారు.

ట్వీట్..

Also Read: Shivathmika Rajashekar: కోలివుడ్‏లో శివాత్మిక దూకుడు… సెట్స్ పై ఫస్ట్ మూవీ… మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్..