AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manjima Mohan: రిలేషన్‏షిప్ స్టేటస్ అడిగిన నెటిజన్… ఫన్నీగా ఆన్సర్ ఇచ్చిన హీరోయిన్..

సెలబ్రెటిల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు. అందుకే అడగాల్సినవి.. అడగకూడని విషయాలను కూడా అడిగేస్తుంటారు.

Manjima Mohan: రిలేషన్‏షిప్ స్టేటస్ అడిగిన నెటిజన్... ఫన్నీగా ఆన్సర్ ఇచ్చిన హీరోయిన్..
Manjima Mohan
Rajitha Chanti
|

Updated on: Jun 29, 2021 | 10:12 PM

Share

సెలబ్రెటిల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు. అందుకే అడగాల్సినవి.. అడగకూడని విషయాలను కూడా అడిగేస్తుంటారు. కరోనా కారణంగా షూటింగ్స్ వాయిదా పడడంతో సెలబ్రెటీలు ఇళ్లలో ఉంటూ… ఖాళీ సమయాన్ని కుటుంబంతో గడుపుతున్నారు. అలాగే ఇటీవల పలువురు నటీనటులు యూజర్లతో చిట్‏చాట్ సెషన్లు నిర్వహిస్తున్నారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తున్నారు. తాజాగా మలయాళ బ్యూటీ మంజిమ మోహన్ కూడా అభిమానులతో ముచ్చటించారు.

Manjim

Manjim

ఈ క్రమంలోనే ఓ నెటిజన్.. మీ రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటీ అని డైరెక్ట్‏గా అడిగేశాడు. ఇందుకు మంజిమ స్పందిస్తూ.. అందరూ లవ్ లో పడుతుంటే.. నేను మాత్రం తిండిపై దృష్టి పెడుతున్నాను అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది. అంటే పరోక్షంగా సింగిల్ అని చెప్పింది. మీ లైఫ్ లో ముఖ్యమైనవి ఏంటి అని మరో నెటిజన్ ప్రశ్నించగా.. ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్, ఫ్యా్మిలీ, కంపాషన్ అంటూ బదులిచ్చింది. మాంజిమా మోహన్ బాలనటిగానే మంచి పేరు తెచ్చుకుంది. మొదటి సినిమా మలయాళంలో, రెండవ సినిమా తమిళంలో చేసి సౌత్‌లో తన సత్తా చాటుతోంది. నివిన్ పాలీ, శింబు, తెలుగులో ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో నాగ చైతన్య లాంటి క్రేజీ హీరోలతో నటించిన మాంజిమా.. భారీ హిట్స్ అందుకుంది.  ఇప్పుడు మంజిమ మోహన్ మళయాల ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్‌గా మారింది.

Also Read:  Bonalu 2021 ; అనారోగ్యంతో ఉన్న వారెవ‌రూ ఆల‌యాల‌కు రావొద్ద‌ు.. బోనాల వేడుక‌ల‌ను ప్ర‌శాంతంగా నిర్వ‌హించాలి : సీపీ అంజ‌నీ కుమార్

Cauliflower Crop : కాలీఫ్లవర్‌ పంటతో మంచి లాభాలు..! జూన్ – జూలై తగిన సమయం.. తక్కువ పెట్టుబడి అధిక రాబడి..

Seethakka : వంద కార్లతో ర్యాలీ తీసిన సీతక్క.. అధికారాన్ని అనుభవించడానికి కాంగ్రెస్‌లోకి రాలేదని వ్యాఖ్య, రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Mariamma Lockup Death Case: మరియమ్మ లాకప్ డెత్ కేసు విచారణ వేగవంతం.. మరో పోలీసు అధికారిపై బదిలీ వేటు!