Seethakka : వంద కార్లతో ర్యాలీ తీసిన సీతక్క.. అధికారాన్ని అనుభవించడానికి కాంగ్రెస్‌లోకి రాలేదని వ్యాఖ్య, రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
సీతక్కపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకటే కుర్చీ ఉంటే.. ఆ కుర్చీలో సీతక్కనే కూర్చో పెడతానని ఆయన వ్యాఖ్యానించారు..
MLA Seethakka Greets TPCC New Chief Revanth reddy : ములుగు ఎమ్మెల్యే సీతక్క 100 కార్లతో భారీ ర్యాలీగా వచ్చి టీపీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తన శుభాకాంక్షలు చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీని అధికారంలోకి తేవడానికే తాము కాంగ్రెస్ పార్టీలో చేరాంకానీ.. అధికారాన్ని అనుభవించడానికి కాంగ్రెస్‌లోకి రాలేదన్నారు సీతక్క. పార్టీ పలుచన అయ్యేలా ఎవరూ మాట్లాడొద్దని.. మెజారిటీ అభిప్రాయం మేరకే రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినప్పుడే తమకు నిజమైన సంతోషమని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు.
మంగళవారం ఆమె ములుగు నుంచి వంద వాహనాల భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ కు వచ్చి రేవంత్ ను కలిశారు. జిల్లా కార్యకర్తలను పరిచయం చేశారు. రేవంత్ పీసీసీగా ఎంపికైన సందర్భంగా మొన్న సమ్మక సారలమ్మలను దర్శించుకున్న సీతక్క…. అక్కడి నుంచి తెచ్చిన దారాన్ని రేవంత్ కు కట్టారు. నియోజకవర్గం పనుల్లో బిజీగా ఉండటం వల్లే….. రేవంత్ కు పీసీసీ అప్పగించినప్పటి నుంచి కలవలేకపోయానన్నారు సీతక్క. ఇవాళ వీలు దొరకడంతో రేవంత్ ను కలిసి సన్మానించానన్నారు.
ఈ సందర్భంగా సీతక్కపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకటే కుర్చీ ఉంటే.. ఆ కుర్చీలో సీతక్కనే కూర్చో పెడతానని ఆయన వ్యాఖ్యానించారు. సీతక్క తనకు అండగా వుందని, రాబోయే రోజుల్లో రాష్ట్ర నలుమూలల తిరగాల్సి ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ తల్లి సోనియా గాంధేనని స్పష్టం చేశారు. సీతక్క తనతో సరిసమానమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
Read also : Revanth Reddy : ‘టీ.ఆర్.ఎస్ ను వెయ్యి కిలోమీటర్ల లోతులో పాతిపెడతా.’ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి