Revanth Reddy : ‘టీ.ఆర్.ఎస్ ను వెయ్యి కిలోమీటర్ల లోతులో పాతిపెడతా.’ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

సమ్మక్క, సారలమ్మ కాకతీయ రాజుల మీద ఏ విధంగా పోరాటం చేశారో.. అలాగే సీతక్క తో కలిసి పోరాటం చేస్తా.. టీ.ఆర్.ఎస్ ను వెయ్యి కిలోమీటర్ల లోతులో..

Revanth Reddy : 'టీ.ఆర్.ఎస్ ను వెయ్యి కిలోమీటర్ల లోతులో పాతిపెడతా.'  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
Revanth Reddy And Seetakka
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 29, 2021 | 9:10 PM

PCC Chief Revanth Reddy : “నాకు పీసీసీ పదవి.. పేద ప్రజల సమస్యలపై పోరాటం చేయడానికి ఒక అవకాశం” అని అన్నారు తెలంగాణ కొత్త పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. “నాకు పీసీసీ పదవీ వస్తదని నిఘా వర్గాల రిపోర్ట్ రాగానే.. ప్రగతి భవన్ తలుపులు తెరిచారు. ఖబర్దార్ కేసీఆర్.. నీ సంగతి చూస్తా. కరెంట్ తీగలా కాదు.. హై టెన్షన్ వైరులా కొట్లాడతాం.” అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. “నా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని ప్రతీ పోలీస్ స్టేషన్లో ఆరు నెలలకు ఒకసారి ఎస్సై మారుతుండు. ఎస్సై పోస్టుకు పది లక్షలు వసూలు చేస్తున్నారు. సీఐకి 25 లక్షలు వసూలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు నెల నెల మామూళ్లు ఇవ్వాల్సి వస్తోంది. ఈ విష సంస్కృతికి కారణం సీఎం కేసీఆర్ పరిపాలన కాదా.” అని రేవంత్ ప్రశ్నించారు.

“కేసీఆర్ పోతేనే.. ఈ విష సంస్కృతి పోతుంది. టీ.ఆర్.ఎస్ స్థానిక ప్రజా ప్రతినిధులను అడుగుతున్న.. ఇజ్జత్ లేని బతుకు అవసరమా..! పంటకు చెదలు వస్తే.. కాపాడుకోవడానికి ఏం చేస్తామో.. భవిష్యత్తు తరాలను కాపాడాలంటే నడుం బిగించాలి. తెలంగాణ తల్లి ని .. సోనియాగాంధీ ఇచ్చారు. ఈ రోజు దోపిడీ, దోంగల పాలైంది తెలంగాణ. ఇక నుంచి కేసీఆర్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తా” అని రేవంత్ రెడ్డి అన్నారు.

” యువ ప్రతినిధి ఉండాలనే ఆలోచనతో.. సీనియర్లను ఒప్పించి నాకు పీసీసీ అధ్యక్ష పదవి.. సోనియా గాంధీ ఇచ్చారు. నా కుటుంబానికి ఏ ఆపద లేదు.. నా బాధ్యత మొత్తం తెలంగాణ సమాజం కేసీఆర్ చేతిలో బంధి అయిన తెలంగాణ కు విముక్తి కల్పిస్తా. సమ్మక్క, సారలమ్మ కాకతీయ రాజుల మీద ఏ విధంగా పోరాటం చేశారో.. అలాగే సీతక్క తో కలిసి పోరాటం చేస్తా.. టీ.ఆర్.ఎస్ ను వెయ్యి కిలోమీటర్ల లోతులో పాతిపెడతా.” అని రేవంత్ రెడ్డి అన్నారు.

Read also : CM Jagan : ప్రకాశం బ్యారేజీ నుంచి రాయపూడి వరకూ కరకట్ట విస్తరణ పనులకు రేపు సీఎం శంకుస్థాపన