CM Jagan : ప్రకాశం బ్యారేజీ నుంచి రాయపూడి వరకూ కరకట్ట విస్తరణ పనులకు రేపు సీఎం శంకుస్థాపన

కృష్ణానది కరకట్ట పనులకు సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రకాశం బ్యారేజీ నుంచి రాయపూడి వరకూ 15.525 కి.మీ. మేర విస్తరణ..

CM Jagan : ప్రకాశం బ్యారేజీ నుంచి రాయపూడి వరకూ కరకట్ట విస్తరణ పనులకు రేపు సీఎం శంకుస్థాపన
Ap Cm Jagan
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 29, 2021 | 8:25 PM

Krishna River : కృష్ణానది కరకట్ట పనులకు సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రకాశం బ్యారేజీ నుంచి రాయపూడి వరకూ 15.525 కి.మీ. మేర విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం ఏపీ సర్కారు రూ. 150 కోట్లు ఖర్చు చేయనుంది. రేపు ఉదయం 10:25 గంటల ప్రాంతంలో సీఎం పనులకు శ్రీకారం చుడతారు. ప్రకాశం బ్యారేజి వద్ద నున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు కుడివైపు కృష్ణా కరకట్ట రోడ్డును విస్తరించనున్నారు.

ఈ కరకట్ట నిర్మాణం ద్వారా అమరావతి, సచివాలయం, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్ధలకు, తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక, తుళ్ళూరు మండలం వెంకటపాలెం, మందడం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, అమరావతి మండలం హరిశ్చంద్రాపురం, వైకుంఠపురం గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది.

అమరావతి స్మార్ట్‌ అండ్‌ సస్టెయినబుల్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిధులతో జలవనరుల శాఖ ద్వారా ఈ పనులు చేపట్టనున్నారు. మొత్తంగా 10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసలు వాహనాలు వెళ్లడానికి, మరో రెండు వరుసలు ఇరువైపులా నడకదారులను నిర్మిస్తున్నారు.

ఈ రహదారిలో కొండవీటి వాగు బ్రిడ్జిని పునర్‌నిర్మించడం, వెంకటాయపాలెం, రాయపూడి అవుట్‌ఫాల్‌ స్లూయిస్, వరద పర్యవేక్షణ కేంద్రాలను నిర్మిస్తారు. అమరావతిలోని ఎన్‌ 1 నుంచి ఎన్‌ 3 రోడ్డులను ఉండవల్లి – రాయపూడి – అమరావతి సీడ్‌ యాక్సిస్‌ రోడ్, గొల్లపూడి – చిన్నకాకాని – విజయవాడ బైపాస్‌ రోడ్లకు అనుసంధానిస్తారు.

Read also : Bonalu Festival: బోనాల నిర్వహణపై మంత్రుల సమీక్ష.. కీలక ఆదేశాలు