Bonalu Festival: బోనాల నిర్వహణపై మంత్రుల సమీక్ష.. కీలక ఆదేశాలు

వైభ‌వం ఉట్టిప‌డేలా బోనాలు పండుగ నిర్వహిస్తామని తెలంగాణ మంత్రులు తెలిపారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు..

Bonalu Festival: బోనాల నిర్వహణపై మంత్రుల సమీక్ష.. కీలక ఆదేశాలు
Bonalu
Follow us

|

Updated on: Jun 29, 2021 | 7:13 PM

Bonalu 2021 : వైభ‌వం ఉట్టిప‌డేలా బోనాలు పండుగ నిర్వహిస్తామని తెలంగాణ మంత్రులు తెలిపారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖ‌ర్ రావు 15 కోట్ల రూపాయలు మంజూరు చేశార‌ని మంత్రులు వెల్లడించారు. మంగ‌ళ‌వారం బోనాల ఏర్పాట్లు, నిర్వహణపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాద‌వ్, హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ… అధికారులతో అర‌ణ్య భ‌వ‌న్ లో ఇవాళ స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రులు మాట్లాడుతూ… సీఎం విడుదల చేసిన నిధుల‌ను స‌ద్వినియోగం చేసుకుని బోనాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని అధికార్లను సూచించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను వైభ‌వంగా నిర్వ‌హించేలా అన్ని ఏర్పాట్లు చేయాల‌న్నారు. ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌, అలంకర‌ణ‌, పూజ కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌భుత్వం ఇచ్చే నిధుల‌ను స‌కాలంలో ఆల‌య క‌మిటీల‌కు మంజూరు చేయాల‌ని అధికార్లకు సూచించారు.

అమ్మవారి ఆలయాల‌ను సుందరంగా తీర్చిదిద్దాల‌ని, విద్యుత్‌ దీపాలతో శోభాయమానంగా అలంకరించాల‌ని మంత్రులు తెలిపారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని చెప్పారు. ఆల‌యాలో పాటు జంట న‌గ‌రాల్లోని ప్ర‌ముఖ ప్ర‌దేశాల‌ను విద్యుత్ దీపాలతో అలంకరించాల‌ని సూచించారు.

బోనాల‌కు వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాల‌న్నారు. ఆల‌యాల వ‌ద్ద‌ క్యూలైన్లు, నీటి సౌకర్యం క‌ల్పించాల‌న్నారు. భక్తులు తప్పనిసరిగా మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి దర్శనాలు చేసుకోవాలని కోరారు. ఆల‌యాల వ‌ద్ద కూడా మాస్కుల‌ను, శానిటైజ‌ర్ల్ ఉండేలా చూడాల‌ని తెలిపారు. ఈ స‌మావేశంలో దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ శ్వేతా మహంతి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Read also : Chiranjeevi : చిరంజీవి గురించి వచ్చిన వార్తలన్నీ పచ్చి అబద్ధం.. ఎఐసిసి, ఎపిసిసి స్పష్టీకరణ

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి