Investment Scheme: రోజుకు రూ. 200 ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ. 14 లక్షల వరకు ఆదాయం.. ఈ స్కీమ్‌ పూర్తి వివరాలు..!

Investment Scheme: ప్రస్తుతం తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్కువ లాభాలు వచ్చే స్కీమ్స్‌ అనేకం ఉన్నాయి. పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారానే కాదు.. తక్కువ..

Investment Scheme: రోజుకు రూ. 200 ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ. 14 లక్షల వరకు ఆదాయం.. ఈ స్కీమ్‌ పూర్తి వివరాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jun 28, 2021 | 10:45 AM

Investment Scheme: ప్రస్తుతం తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్కువ లాభాలు వచ్చే స్కీమ్స్‌ అనేకం ఉన్నాయి. పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారానే కాదు.. తక్కువ పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇందుకు ఆ అవకాశం పబ్లిక్‌ ప్రావిండెంట్‌ ఫండ్‌ కల్పిస్తోంది. ఇందులో మీరు రోజుకు రూ.200 చొప్పున ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడం ద్వారా 14 లక్షల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది. ఇందు కోసం మీరు మీ నిధులను పబ్లిక్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఖాతాలో రోజుకు రూ.200 జమ చేస్తే 20 సంవత్సరాల తరువాత రూ .14 లక్షల వరకు మీకు అందుతుంది. అయితే పీపీఎఫ్ పథకం కింద మీరు ఇన్వెస్ట్‌ చేసిన డబ్బు ఎప్పుడూ సురక్షితమే. అంతేకాదు సంపాదించిన వడ్డీ రేటుకు పన్ను చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌లో డబ్బులు జమ చేస్తే మీకు నామినీ ప్రయోజనం కూడా ఉంది. ఇందు కోసం మీరు పోస్టాఫీసు, బ్యాంకు వద్ద ఖాతా తెరవవచ్చు. 15 ఏళ్ల పాటు నిధులు జమ చేయాల్సి ఉంటుంది. ఈ కాలపరిమితిని మరో 5 సంవత్సరాల వరకు పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది.

అలాగే ఇలాంటి స్కీమ్స్‌ పోస్టాఫీసుల్లో, బ్యాంకుల్లోను అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే స్కీమ్‌లు ఉన్నాయి. ఇలాంటి స్కీమ్‌లలో మీరు ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాలనుకుంటే పోస్టాఫీసు, బ్యాంకుల్లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి

SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్లు అలర్ట్‌.. జూలై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంబంధనలు.. తప్పకుండా తెలుసుకోండి

SBI Business Loan: గుడ్‌న్యూస్‌.. ఎస్‌బీఐ మరో కొత్త లోన్‌ స్కీమ్‌.. వీరు సులభంగా రుణం పొందవచ్చు..!

Mukesh Amban: రూ.75 వేల కోట్లతో రిలయన్స్‌ ముఖేష్‌ అంబానీ కొత్త బిజినెస్‌.. పూర్తి వివరాలు ఇలా..!