AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్లు అలర్ట్‌.. జూలై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంబంధనలు.. తప్పకుండా తెలుసుకోండి

SBI Alert: దేశీయ అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)లో ఖాతా ఉందా..? అయితే ఈ విషయాలను మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. 2021 జూలై 1వ..

SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్లు అలర్ట్‌.. జూలై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంబంధనలు.. తప్పకుండా తెలుసుకోండి
Subhash Goud
|

Updated on: Jun 27, 2021 | 6:45 AM

Share

SBI Alert: దేశీయ అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)లో ఖాతా ఉందా..? అయితే ఈ విషయాలను మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. 2021 జూలై 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో ఈ నిబంధనలు చాలా మందిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎస్‌బీఐలో అనేక రూల్స్‌ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఎస్‌బీఐలో ఖాతాలు ఉన్నవారు ఎప్పటికప్పుడు బ్యాంకు తీసుకువస్తున్న రూల్స్‌ను తెలుసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశాలుంటాయి. వినియోగదారులపై ఛార్జీలు విధించడం, తగ్గించడం, ఇతర లావాదేవీల విషయాలలో అనేక మార్పులు చేస్తుంటుంది స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. ఇందులో భాగంగానే వచ్చే నెల నుంచి కొత్త నిబంధనలు మారనున్నాయి. ఎస్‌బీఐ బేసిక్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ సర్వీసు ఛార్జీలను సవరించింది ఎస్‌బీఐ. బ్యాంక్‌ నగదు ఉపసంహరణ, ఏటీఎం విత్‌డ్రాయల్స్‌, చెక్‌ బుక్స్‌, ట్రాన్స్‌ఫర్‌, నాన్‌ ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్లకు సవరించిన కొత్త సర్వీస్‌ చార్జీలు జూలై 1 నుంచి వర్తిస్తాయని బ్యాంకు వెల్లడించింది.

ఉచిత నగదు లావాదేవీలు:

నెలలో నాలుగు ఉచిత నగదు లావాదేవీలు ఉపసంహరణ ముగిసిన తర్వాత ఒక్కో లావాదేవీకి రూ.15 ఛార్జీ విధించనుంది. అలాగే జీఎస్‌టీ అదనం. బ్యాంక్ బ్రాంచ్ లేదా ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్ రెండింటికీ ఇదే ఛార్జీలు పడతాయి.

చెక్‌ బుక్‌ ఛార్జీలు:

ఇక ఎస్‌బీఐ ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్ లీవ్స్‌ను ఉచితంగా అందిస్తుంది. వీటి తర్వాత 10 చెక్ లీవ్స్‌కు రూ.40 ఛార్జీ పడుతుంది. అలాగే జీఎస్‌టీ అదనం. 25 చెక్ లీవ్స్‌కు అయితే రూ.75 చార్జీ, జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ చెక్ బుక్ (10 చెక్ లీవ్స్) కోసం అయితే రూ.50 ఛార్జీతోపాటు జీఎస్‌టీ పడుతుంది.

గృహరహిత శాఖలలో వినియోగదారులు నగదు ఉపసంహరించుకునేందుకు పరిమితిని ఇటీవల పెంచింది ఎస్‌బీఐ. కరోనా మహమ్మారిలో మా కస్టమర్లకు మద్దతు ఇవ్వడానికి ఎస్‌బీఐ చెక్‌, ఉపసంహరణ ఫారం ద్వారా గృహేతర నగదు ఉపసంహరణ పరిమితిని పెంచుతున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. చెక్‌ను ఉపయోగించి నగదు ఉపసంహరణను రోజుకు లక్ష రూపాయల వరకు పెంచింది. అలాగే సేవింగ్స్‌, పాస్‌బుక్‌తో పాటు ఫారమ్‌ను ఉపయోగించి నగదు ఉపసంహరణను రోజుకు రూ.25 వేలకు పెంచారు.

ఇవీ కూడా చదవండి:

SBI Business Loan: గుడ్‌న్యూస్‌.. ఎస్‌బీఐ మరో కొత్త లోన్‌ స్కీమ్‌.. వీరు సులభంగా రుణం పొందవచ్చు..!

Mukesh Amban: రూ.75 వేల కోట్లతో రిలయన్స్‌ ముఖేష్‌ అంబానీ కొత్త బిజినెస్‌.. పూర్తి వివరాలు ఇలా..!

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!