Fact Check: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు..? నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న జీవో! స్పందించిన ప్రభుత్వం

కోవిడ్ -19 సంక్షోభ సమయంలో ఆగిపోయిన కరువు భత్యం (డీఏ) జులై 1, 2021 నుంచి అందిస్తామంటూ ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ పేరిట విడుదలైన ఆర్డర్లు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

Fact Check: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు..? నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న జీవో! స్పందించిన ప్రభుత్వం
Da For Govt Employees
Follow us
Venkata Chari

|

Updated on: Jun 27, 2021 | 8:22 AM

DA For Govt Employees: కోవిడ్ -19 సంక్షోభ సమయంలో ఆగిపోయిన కరువు భత్యం (డీఏ) జులై 1, 2021 నుంచి అందిస్తామంటూ ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ పేరిట విడుదలైన ఆర్డర్లు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియాలో షేరవుతోన్న ఆర్డర్ కాఫీలు శనివారం నకిలీవని తేల్చేసింది. సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఆఫీస్ మెమోరాండం (ఓఎం) ప్రభుత్వం జారీ చేసింది కాదని, ఇది నకిలీదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో పేర్కొంది. ఇందులో ఏముందంటే.. కోవిడ్ సంక్షోభ సమయంలో ఆగిపోయిన డీఏను జులై 1, 2021 నుంచి తిరిగి ప్రారంభిస్తామని ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ ఆర్డర్లు జారీ చేసినట్లు అందులో ఉంది. అలాగే ” 2020 జులై 1 నుంచి 2021 జులై 1 వరకు లెక్కించిన డీఏను మూడు విడతలుగా చెల్లిస్తామని అందులో ఉంది.”

దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు 61 లక్షల మంది పెన్షనర్లకు డీఏ పెంచాలని ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌లో నిర్ణయించింది. అయితే, ఈ ఆర్డర్లు నకిలీవని ప్రభుత్వం ప్రకటించడంతో ఉద్యోగులు, పెన్షనర్లు చాలా నిరాశకు గురయ్యారు. డీఏ వస్తుందనే వార్తలతో సంతోషించిన వీరంతా.. అవికాస్త ఫేక్ న్యూస్ అని తేల్చడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తోంది. ఉద్యోగులతో చెలగాటాలాడొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింగ్వి డిమాండ్ చేశారు. సైనికులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అందించే దాదాపు రూ .37,500 కోట్లను ప్రభుత్వం దోచుకోవడం ఏంటని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్‌ చేశారు.

Also Read:

SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్లు అలర్ట్‌.. జూలై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంబంధనలు.. తప్పకుండా తెలుసుకోండి

Gold Price Today: దేశీయంగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం స్వల్పంగా పెరిగింది

Silver Price Today: వెండి కొనుగోలుదారులకు శుభవార్త.. తగ్గిన సిల్వర్‌.. ప్రధాన నగరాల్లో ధరలు వివరాలు..!