Petrol Price: మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
దేశ వ్యాప్తంగా చమురు ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. శనివారం లీటర్ పెట్రోల్ పై రూ. 35 పైసలు పెంచిన కంపెనీలు.. , డీజిల్‌పై రూ. 37 పైసలు పెంచాయి.
Petrol Price: దేశ వ్యాప్తంగా చమురు ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. శనివారం లీటర్ పెట్రోల్ పై రూ. 35 పైసలు పెంచిన కంపెనీలు.. , డీజిల్‌పై రూ. 37 పైసలు పెంచాయి. నేడు (ఆదివారం) మరో పెట్రోల్, డీజల్‌పై వరుసగా రూ.36 పైసలు, రూ.26 పైసల మేర పెంచాయి. పెంచిన రేట్లతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ రూ.98.47 ఉండగా, డీజిల్ ధర రూ.88.91కి చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.102.32కి చేరగా, డీజిల్ ధర రూ.96.90లు పెరిగింది. 55 రోజుల్లో పెట్రోల్‌పై లీటరు కు రూ.8.07 పెరగగా, డీజిల్‌పై రూ.8.38 పెంచాయి చమురు కంపెనీలు. మే 4 నుంచి నేటి వరకు దాదాపు 31 సార్లు ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో చాలా నగరాల్లో పెట్రోల్ ధర రూ.100కు చేరుకుంది. అలాగే డీజిల్ కూడా రూ.100 కు చేరువలో ఉంది.
వివిధ నగరాల్లో చమురు ధరలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 102.32 కాగా, డీజిల్ ధర రూ. 96.90లకు చేరుకుంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 99.49, డీజిల్ ధర 93.46 ముంబైలో పెట్రోల్ ధర రూ. 104.56, డీజిల్ ధర రూ. 96.42 బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 101.75, డీజిల్ రూ. 94.25
Also Read:
Gold Price Today: దేశీయంగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం స్వల్పంగా పెరిగింది