Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

July 1st New Rules: సామాన్యులకు అలర్ట్… నేటి నుంచి మారనున్న అంశాలు ఇవే.. బ్యాంకుల నుంచి సిలిండర్ వరకు కొత్త రూల్స్..

July 1st New Rules:  కొత్త మాసం ఆరంభం.. కొత్త నెలతోపాటు.. పలు అంశాల్లో కొత్త మార్పులు, రూల్స్ కూడా వస్తుంటాయి. బ్యాంకింగ్ రంగం నుంచి ఆదాయం..

July 1st New Rules: సామాన్యులకు అలర్ట్... నేటి నుంచి మారనున్న అంశాలు ఇవే.. బ్యాంకుల నుంచి సిలిండర్ వరకు కొత్త రూల్స్..
July New Rules
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 01, 2021 | 8:04 AM

July 1st New Rules:  కొత్త మాసం ఆరంభం.. కొత్త నెలతోపాటు.. పలు అంశాల్లో కొత్త మార్పులు, రూల్స్ కూడా వస్తుంటాయి. బ్యాంకింగ్ రంగం నుంచి ఆదాయం.. సిలిండర్ వంటి పలు అంశాలలోని నియమ నిబంధనలు మారుతూ ఉంటాయి. మరీ జూలై నెలలో జరగబోయే మార్పుల గురించి తెలుసుకుందామా.

SBI: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) జూలై 1 నుంచి కొన్ని పరిమితులు విధించనుంది. అందులో ప్రాథమిక పొదుపు బ్యాంక్ డిపాజిట్ ఖాతా (బీఎస్బీడీ) కలిగిన ఖాతాదారుల లావాదేవీలపై పలు మార్పులు చేయనుంది. ఈ అకౌంట్ ఉన్నవారు.. బ్యాంకులు, ఏటీఎంల నుంచి నెలకు ఉచితంగా నాలుగుసార్లు మాత్రమే మనీ విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఒక్కో విత్ డ్రా పై రూ.15 (జీఎస్టీ ఎక్స్ ట్రా) చొప్పున మనీ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

సిలిండర్ పై : ప్రతి నెల గ్యాస్ సిలిండర్ అంశంలో కొన్ని రకాలు మార్పులు జరుగుతుంటాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలను ప్రతి 15 రోజులకు ఒకసారి పెట్రోలియ కంపెనీలు మారుస్తుంటాయి. కానీ గత నెల జూన్ లో గ్యాస్ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. అయితే గత కొద్ధి రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్న ఆయిల్ సంస్థలు ఈ నెల గ్యాస్ సిలిండర్ ధరలను ఎలా ఉంచుతాయో చూడాలి.

చెక్ బుక్ లిమిట్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఈసారి తమ కస్టమర్లకు భారీగానే షాక్ ఇస్తుంది. చెక్కులు కూడా సంవత్సరానికి 10కి దాటితే భారం మోపేందుకు సిద్ధమవుతుంది. 10 చెక్కుల కొత్త చెక్కు పుస్తకం కోసం రూ.40. 25 చెక్కుల పుస్తకం కోసం రూ.75 (డీఎస్టీ అదనం) చెల్సించాల్సి ఉంటుంది. అయితే వీటినుంచి సీనియర్ సిటిజన్లకు మినహాయింపు ఉంటుంది.

సిండికోడ్ బ్యాంక్ కోడ్ : సిండికేట్ బ్యాంకు.. కెనరా బ్యాంకులో విలీనం అయిన సంగతి తెలిసిందే. జూలై 1 నుంచి సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులు కెనరా బ్యాంక్ కు చెందిన కొత్త ఐఎఫ్ఎసీ కోడ్ లు వినియోగించాల్సి ఉంటుంది. వీటిని కెనరా బ్యాంక్ వెబ్ సైట్ ద్వారా తీసుకోవచ్చు.

పాత చెక్కులు: ఆంధ్రబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంకులో విలీనం అయినందున పాత చెక్కులు జూలై 1 నుంచి చెల్లవు. కొత్త చెక్కు బుక్కులను యూనియన్ బ్యాంకుల్లో తీసుకోవాల్సి ఉంటుంది.

టీడీఎస్ కొత్త రూల్స్: గత రెండు ఆర్థిక సంవత్సరాల ఆదాయానికి సంబంధించి మూలం వద్ద పన్ను చెల్లింపు (టీడీఎస్), మూలం వద్ద పన్నులు వసూలు (టీసీఎస్) రూ.50,000 మించి ఉన్నప్పటికీ.. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని వారి నుంచి అధిక శాతంలో పన్ను వసూలు చేయాలని ఆదాయపు పన్ను విభాగం నిర్ణయించింది. ఈ నియమాలు జూలై 1 నుంచి అమలులోకి రానుంది.

హీరో ధరలు: టూవీలర్ బైక్ ధరలను పెంచేందుకు ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్ సిద్ధమైంది. ముడి సరకు ధరలు పెరడంతో వాహన ధరలు పెంచుతున్నట్లుగా గతంలో ప్రకటించింది కంపెనీ. ఇవి జూలై1 నుంచి అమలులోకి రానుంది.

Also Read: Wimbledon 2021 Day 3 Highlights: సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్, సబలెంకా ముందడుగు; కెనిన్, అండ్రస్కూ, బెన్ చిచ్ ఓటమి

Mahesh Babu-Rajamouli : మహేష్ తో జక్కన మాస్టర్ ప్లాన్.. సూపర్ స్టార్ తో రాజమౌళి అలాంటి స్టోరీ చేయబోతున్నారా..?