Wimbledon 2021 Day 3 Highlights: సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్, సబలెంకా ముందడుగు; కెనిన్, అండ్రస్కూ, బెన్ చిచ్ ఓటమి

సెర్బియా స్టార్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ కెరీర్ లో 20వ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ కోసం మరో అడుగు ముందుకేశాడు.

Wimbledon 2021 Day 3 Highlights: సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్, సబలెంకా ముందడుగు; కెనిన్, అండ్రస్కూ, బెన్ చిచ్ ఓటమి
Wimbledon 2021 Day 3 Highlights Novak And Sabalenka
Follow us
Venkata Chari

|

Updated on: Jul 01, 2021 | 7:24 AM

Wimbledon 2021 Day 3: సెర్బియా స్టార్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ కెరీర్ లో 20వ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ కోసం మరో అడుగు ముందుకేశాడు. మూడో రోజు జరిగిన ఆటలో భాగంగా దక్షిణాఫ్రికా ఆటగాడు కెవిన్ అండర్సన్ తో బుధవారం తలపడి, మూడో రౌండ్ల్ లోకి దూసుకెళ్లాడు. ఈ మ్యాచ్ లో జకోవిచ్ 6–3, 6–3, 6–3తో విజయం సాధించాడు. ఈ మ్యాచ్ లో ఒక్క బ్రేక్‌ పాయింట్‌ కూడా ఎదుర్కోకుండా విజయం సాధించాడు నొవాక్ జకోవిచ్. జకోవిడ్ ఈ మ్యాచ్ లో మొత్తం 9 ఏస్‌లు సంధించాడు. జొకోవిచ్‌ ఆరు సార్లు మాత్రమే తప్పులు చేయగా, ప్రత్యర్థి అండర్సన్ మాత్రం 26 సార్లు తప్పులు చేసి పరాజయం పాలయ్యాడు. మరోమ్యాచ్ లో స్పెయిన్ ఆటగాడు పాబ్లో కరెనో బుస్టా 12వ సీడ్‌ నార్వే ఆటగాడితో కాస్పెర్‌ రూడ్‌ తొలి రౌండ్‌లో తలపడి ఓడిపోయాడు. అలాగే అమెరికా ఆటగాడు సామ్‌ క్వెరీ 7–6(8/6), 6–4, 7–5తో కరెనో బుస్టాను ఓడించి తదుపరి రౌండ్ లోకి ఎంటర్ అయ్యాడు, ఆస్ట్రేలియా ఆటగాడు జోర్డాన్‌ థాంప్సన్‌ 7–6 (8/6), 7–6 (7/3), 2–6, 2–6, 6–2తో రూడ్‌ పై విజయం సాధించి తదుపరి రౌండ్ లోకి ప్రవేశించాడు.

మరోవైపు మహిళల సింగిల్స్‌ లో 2వ సీడ్ బెలారస్ క్రీడాకారిణి సబలెంకా 3వ రౌండ్‌లోకి ఎంటరైంది. ఆమె రెండో రౌండ్‌లో 4–6, 6–3, 6–3తో బ్రిటన్ ప్లేయర్ పై కేటీ బౌల్టర్‌ విజయం సాధించింది. 4వ సీడ్‌ అమెరికా ప్లేయర్ సోఫియా కెనిన్‌, 5వ సీడ్‌ కెనడా క్రీడాకారిణి బియాంక ఆండ్రెస్కూ, 9వ సీడ్‌ స్విట్జర్లాండ్ ప్లేయర్ బెలిండా బెన్‌చిచ్‌ తొలి రౌండ్‌లో ఓడిపోయి టోర్నీ నుంచి వెనుదిరిగారు. ఫ్రాన్స్ ప్లేయర్ అలీజె కార్నె 6–2, 6–1తో ఆండ్రెస్కూపై విజయం సాధించగా, స్లొవేనియా ప్లేయర్ కాయా యువాన్‌ 6–3, 6–3తో బెన్‌చిచ్‌పై గెలిచి తదుపరి రౌండ్ లోకి ఎంటరయ్యారు.

Also Read:

Saina Nehwal: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ నెమలితో చెలిమి.. వైరల్ అయిన వీడియో

Rajiv Gandhi Khel Ratna: రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు బరిలో మిథాలీ, అశ్విన్..!