Rajiv Gandhi Khel Ratna: రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు బరిలో మిథాలీ, అశ్విన్..!

క్రీడల్లో ఆటగాళ్లకు అందించే అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డు కోసం ఇద్దరు బరిలో నిలిచారు. పురుషుల జట్టు నుంచి స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్, మహిళల టీం నుంచి మిథాలీ రాజ్ బరిలో నిలిచినట్లు బీసీసీఐ పేర్కొంది.

Rajiv Gandhi Khel Ratna: రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు బరిలో మిథాలీ, అశ్విన్..!
Ravichandran Ashwin And Mithali Raj
Follow us

|

Updated on: Jun 30, 2021 | 4:33 PM

Rajiv Gandhi Khel Ratna: క్రీడల్లో ఆటగాళ్లకు అందించే అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డు కోసం ఇద్దరు బరిలో నిలిచారు. పురుషుల జట్టు నుంచి స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్, మహిళల టీం నుంచి మిథాలీ రాజ్ బరిలో నిలిచినట్లు బీసీసీఐ పేర్కొంది. ఇక అర్జున అవార్డుల కోసం టీమిండియా పేస్ బౌల‌ర్ జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, టీమిండియా సీనియర్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ పేర్ల‌ను బీసీసీఐ ప్రతిపాదించింది. మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్లో 22 సంవత్సరాలను ఇటీవలే పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. 1999 జూన్‌ 26న ఇంటర్నేషనల్‌ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చారు. మహిళల క్రికెట్లో అత్యధిక వన్డేలు ఆడిన క్రికెటర్‌ కూడా మిథాలీ రాజ్ అగ్రస్థానంలో నిలిచారు. 216 మ్యాచులాడి 7170 పరుగులు చేశారు. భారత్ తరఫున 11 టెస్టులు, 215 వన్డేలు, 89 టీ20లు ఆడారు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత మహిళలు పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడుతున్నారు. మొదటి వన్డేలో ఓడిపోయిన టీమిండియా, రెండో వన్డేలో నేటి సాయంత్రం తలపడనుంది.

స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ మూడు ఫార్మాట్‌లలో అత్యధిక వికెట్లు తీసి భారత్ విజయాల్లో పాలుపంచుకున్నాడు. 79 టెస్టుల్లో 24.6 సగటుతో వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు 413 వికెట్లు పడగొట్టాడు. కెరీర్‌లో మొత్తం 30 సార్లు ఒక ఇన్నింగ్స్‌లో 5 కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. ఏడుసార్లు 10 వికెట్ల ప్రదర్శన చూపాడు. 111 వన్డేలో 150, 46 టీ20లో 52 వికెట్లు పడగొట్టాడు.

Also Read:

MS Dhoni: ఆటగాళ్లను ధోనీ అలా చేసేవాడు కాదు: ఆకాశ్‌ చోప్రా

ICC Test Rankings: అగ్రస్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్.. కోహ్లీ స్థానంలో మార్పు లేదు..!

Team India: 24 ఏళ్లకే భారత జట్టులోకి వచ్చి.. అనూహ్యంగా నాలుగు నెలలకే వైదొలిగాడు.. అతడెవరంటే!

Latest Articles
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?