MS Dhoni: ఆటగాళ్లను ధోనీ అలా చేసేవాడు కాదు: ఆకాశ్ చోప్రా
ఆటగాళ్లను అభద్రతా భావానికి గురిచేసే లక్షణం టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీది కాదని, కేవలం వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నించేవాడని ఆకాశ్ చోప్రా అన్నారు.
MS Dhoni: ఆటగాళ్లను అభద్రతా భావానికి గురిచేసే లక్షణం టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీది కాదని, కేవలం వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నించేవాడని ఆకాశ్ చోప్రా అన్నారు. యువ క్రికెటర్లకు, బాగా ఆడేవారికి అవకాశాలు అందించి, టీంకు విజయాలు అందించేవాడని, ధోనీ గెలిచిన మూడు ఐసీసీ టోర్నీల్లో ఇదే ఫార్ములా కనిపించిందని ఈయన పేర్కొన్నాడు. ‘ధోనీ నాయకత్వంలో జట్టు ఎంతో ఎత్తకు ఎదిగింది. ఎక్కువగా మార్పులు చేసేవాడు కాదు. అందుకే ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్‌గా ధోనీ ఎదిగాడు. ప్లేయర్లకు అభద్రతా భావం దరిచేరనిచ్చేవాడు కాదు’ అని ఆకాశ్ తెలిపారు. ‘ఏదైనా టోర్నీలో తొలి మ్యాచ్ నుంచి నాకౌట్ వరకు ధోనీ టీం ఓకేలా ఉంటుందని, చాలా కీలకంగా పనిచేసేది. పరుగులు చేయగల వారే అతని టీంలో ఉండేవారు. చాలా తక్కువ పొరపాట్లు చేసే జట్టు క్వార్టర్స్, సెమీస్, ఫైనల్ చేరుకుని విజయాలు సాధిస్తుంది. టీంలో ప్లేయర్ల ప్లేస్‌కు ఎటువంటి అభద్రతా భావం ఉండేది కాదని’ ఆకాశ్ తెలిపారు.
ధోనీ జట్టును చూస్తే.. ఎవరో ఒక ప్లేయర్ మనకు గుర్తుండి పోతారని, 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ ఫైనళ్లలో గౌతమ్ గంభీర్ ఆటను ఎవ్వరూ మర్చిపోరని ఆకాశ్ చోప్రా తెలిపారు. 2011 ప్రపంచ కప్ టోర్నీలో యువరాజ్‌సింగ్ అందరికీ గుర్తుంటాడని పేర్కొన్నారు.
Also Read:
ICC Test Rankings: అగ్రస్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్.. కోహ్లీ స్థానంలో మార్పు లేదు..!
Team India: 24 ఏళ్లకే భారత జట్టులోకి వచ్చి.. అనూహ్యంగా నాలుగు నెలలకే వైదొలిగాడు.. అతడెవరంటే!