Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: 24 ఏళ్లకే భారత జట్టులోకి వచ్చి.. అనూహ్యంగా నాలుగు నెలలకే వైదొలిగాడు.. అతడెవరంటే!

అతడు 24 సంవత్సరాల వయస్సులోనే భారత జట్టులో అరంగేట్రం చేశాడు. మంచి పేస్, స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్లను ఇబ్బంది పెట్టాడు. అయితే అనూహ్యంగా..

Team India: 24 ఏళ్లకే భారత జట్టులోకి వచ్చి.. అనూహ్యంగా నాలుగు నెలలకే వైదొలిగాడు.. అతడెవరంటే!
Dodoo Ganesh
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 30, 2021 | 3:46 PM

అతడు 24 సంవత్సరాల వయస్సులోనే భారత జట్టులో అరంగేట్రం చేశాడు. మంచి పేస్, స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్లను ఇబ్బంది పెట్టాడు. అయితే అనూహ్యంగా నాలుగు నెలల్లోనే జట్టును వైదొలిగాడు. రాహుల్ ద్రవిడ్, జవగల్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే, సునీల్ జోషి వంటి గొప్ప క్రికెటర్లతో ఆడిన ఆ ప్లేయర్ మరెవరో కాదు దొడ్డ గణేష్. కర్ణాటకకు చెందిన గణేష్ పుట్టినరోజు ఈరోజు. అతడు 30 జూన్ 1973న జన్మించాడు. భారత జట్టు తరపున ఒక వన్డే, నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.

భారత మాజీ వికెట్ కీపర్లు సదానంద్ విశ్వనాథ్, రవిశాస్త్రిల స్పూర్తితో గణేష్ మొదటగా.. వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌గా తన కెరీర్ స్టార్ట్ చేశాడు. అయితే ఆ తర్వాత ఒకానొక సందర్భంలో సదానంద్ విశ్వనాథ్ అతనిలోని బౌలింగ్ ప్రతిభను గుర్తించి తారాపూర్ క్లబ్‌లో చేర్పించాడు. అక్కడ నుంచి గణేష్ తన ప్రతిభను కనబరుస్తూ.. అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. ఇరానీ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన కనబరచడంతో టీమిండియా జట్టులోకి టికెట్ వచ్చింది. 1996-97 ఇరానీ ట్రోఫీలో గణేష్ 11 వికెట్లు పడగొట్టగా.. అందులో లక్ష్మణ్, నవజోత్ సింగ్ సిద్ధు వంటి బ్యాట్స్‌మెన్లను అవుట్ చేయడంతో.. టీమిండియా జట్టులోకి ఎంపిక అయ్యాడు.

దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనలకు వెళ్లగా.. గణేష్ ఒక్క సిరీస్‌లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. దీనితో 1997 జనవరిలో భారత జట్టులోకి వచ్చిన గణేష్.. ఏప్రిల్ 1997లో తన కెరీర్‌కు ముగింపు పలకాల్సి వచ్చింది. సరిగ్గా నాలుగు నెలల్లోనే అతని అంతర్జాతీయ కెరీర్ ముగిసింది.

Also Read: 

ఈ ఫోటోలో మరో చిరుత దాగుంది.. కనిపెట్టగలరా! గుర్తు పట్టలేదా.? అయితే ఈ క్లూ ట్రై చేయండి..

బిర్యానీ ఇలా కూడా చేస్తారా! నెటిజన్లు ఫిదా.. వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే!